27, సెప్టెంబర్ 2025, శనివారం

నిను కలిసిన నిముసమున | Ninu Kalisina Nimushamulo | Song Lyrics | CID (1965)

నిను కలిసిన నిముసమున



చిత్రం :  సి.ఐ.డి (1965)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం : పి. సుశీల 


పల్లవి: 


నిను కలిసిన నిముసమున

నిను తెలిసిన క్షణమున

కనుల పండువాయెనే.. 

మనసు నిండిపోయెనే


నిను కలిసిన నిముసమున

నిను తెలిసిన క్షణమున

కనుల పండువాయెనే.. 

మనసు నిండిపోయెనే  


చరణం 1 : 


ఆశాలత మొగ్గలేసి 

పూలు విరగపూసెనే

ఆశాలత మొగ్గలేసి 

పూలు విరగపూసెనే


తలపులెల్ల వలపులై.. 

పులకరింపజేసెనే

తలపులెల్ల వలపులై.. 

పులకరింపజేసెనే .. 

పరవశించి పోతినే..


నిను కలిసిన నిముసమున

నిను తెలిసిన క్షణమున

కనుల పండువాయెనే.. 

మనసు నిండిపోయెనే 


చరణం 2 :


చందమామ నేడేలనో 

చలి వెన్నెల కాయడే

చందమామ నేడేలనో 

చలి వెన్నెల కాయడే


గాలి కూడా ఎందుకనో 

నులి వెచ్చగ వీచెనే

గాలి కూడా ఎందుకనో 

నులి వెచ్చగ వీచెనే.. 

మేను కందిపోయెనే..


నిను కలిసిన నిముసమున

నిను తెలిసిన క్షణమున

కనుల పండువాయెనే.. 

మనసు నిండిపోయెనే


నిను కలిసిన నిముసమున

నిను తెలిసిన క్షణమున

ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... 

ఊ ఊ ఊ ఊ ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి