5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే | Aduvari Matalaku Ardhale verule | Song Lyrics | Missamma (1955)

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  ఏ. ఎం. రాజా


పల్లవి:


ఔనంటే కాదనిలే

కాదంటే అవుననిలే

ఔనంటే కాదనిలే

కాదంటే అవుననిలే


ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...


చరణం 1:


అలిగి తొలగి నిలిచినచో

అలిగి తొలగి నిలిచినచో

చెలిమిజేయ రమ్మనిలే

చొరవ చేసి రమ్మనుచో

చొరవ చేసి రమ్మనుచో

మర్యాదగ పొమ్మనిలే


ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...


చరణం 2:


విసిగి నసిగి కసిరినచో

విసిగి నసిగి కసిరినచో

విషయమసలు ఇష్టమెలే

తరచి తరచి ఊసడిగిన

తరచి తరచి ఊసడిగిన

సరసమింక చాలనిలే


ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...


ఔనంటే కాదనిలే

కాదంటే అవుననిలే

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే

అర్థాలే వేరులే... అర్థాలే వేరులే...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి