అందాలన్ని నీలోనే దాగున్నాయి
చిత్రం: ఇదెక్కడి న్యాయం (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం: రామకృష్ణ, పి. సుశీల,
పల్లవి:
అందాలన్ని.. అందాలన్ని
నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే
రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి...
మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి...
మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. అదిగో పొదా..
ప్రియసుధ.. ప్రియసుధ..
జయసుధా.. హా...
అందాలన్ని.. అందాలన్ని
నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే
రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి...
మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి...
మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. ఇదిగో సుధా..
ప్రియసుధ.. ప్రియసుధ..
జయసుధా.. ఆ...
చరణం 1:
నా కళ్ళు ఇన్నాళ్ళు
నీ చుట్టే తిరిగేవి..
నా కళ్ళు ఇన్నాళ్ళు
నీ చుట్టే తిరిగేవి..
మదిలోన కోరికల
జడి వాన కురిసేది..
జడివాన కురిసేది
చేప్పాలంటే..
పెదవులు ఆగేవి తడబడి...
ఎప్పుడు చూడూ నాలో
ఉప్పెనలాంటి అలజడి ....
పద పదా.. అదిగో పొదా..
ప్రియసుధ.. ప్రియసుధ..
జయసుధా.. హా...
అందాలన్ని నీలోనే
దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే
రా రమ్మనాయి
చరణం 2:
ఎదురెదురు నువ్వుంటే
ఏ మెరుపో మెరిసేది ...
ఎదురెదురు నువ్వుంటే
ఏ మెరుపో మెరిసేది ...
చిరు సిగ్గు తెరలోన
అది కాస్త అణిగేది..
అది కాస్త అణిగేది
ఎవరేమన్నా.. మనది
ఎదురులేని పరవడి...
ఇద్దరి జంటా.. వలచే
పడుచు వాళ్ళకు ఒరవడి
పద పదా.. ఇదిగో సుధా..
ప్రియసుధ.. ప్రియసుధ..
జయసుధా..ఆ...
అందాలన్ని.. అందాలన్ని
నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే
రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి
మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. అదిగో పొదా..
ప్రియసుధ.. ప్రియసుధ..
జయసుధా.. హా...
అందాలన్ని.. అందాలన్ని
నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే
రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి
మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా.. ఇదిగో సుధా..
ప్రియసుధ.. ప్రియసుధ..
జయసుధా.. ఆ..
- పాటల ధనుస్సు









