16, ఆగస్టు 2025, శనివారం

పదే పదే పాడుతున్నా | Padepade padutunna | Song Lyrics | Seethamalakshmi (1978)

పదే పదే పాడుతున్నా



చిత్రం  :  సీతామాలక్ష్మి (1978)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  :  సుశీల


పల్లవి :


పదే పదే పాడుతున్నా... 

పాడిన పాటే

పదే పదే పాడుతున్నా... 

పాడిన పాటే

అది బ్రతుకో... పాటో.. 

నాకే తెలియదు పాడుతు ఉంటే


పదే పదే పాడుతున్నా... 

పాడిన పాటే

అది బ్రతుకో... పాటో.. 

నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... 

పాడిన పాటే  


చరణం 1 :


ఇది అనగనగ కథ కాదు.. 

అందమైన జీవితం

కన్నె వయసు చిలకమ్మ.. 

వెన్న మనసు గోరింక..

కలసి కట్టుకొన్న కలల గూడు.. 

ఒకనాడు..  


చిలకమ్మా ఎగిరిపొయే 

గోరింకను విడిచీ...

గోరింకా కన్నీరింకా... 

వగచే ఇది తలచి

చిలకమ్మా ఎగిరిపొయే 

గోరింకను విడిచీ...

ఆ.ఆ. గోరింకా కన్నీరింకా... 

వగచే ఇది తలచి


ఆమనులే వేసవిలైతే 

ఎవరిని అడగాలి

దీవెనలే శాపాలైతే 

ఎందుకు బ్రతకాలి

మనసన్నది చేయని పాపం.. 

మనసివ్వడమే ఒక నేరం

మనిషైనా మాకైనా.. 

అనుభవమొకటే..ఏ..ఏ...


పదే పదే పాడుతున్నా 

పాడిన పాటే....

అది బ్రతుకో... పాటో.. 

నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... 

పాడిన పాటే 


చరణం 2 :


రామా లీల ప్రేమజ్వాలా 

రగిలిన బ్రతుకేలే

రాలు పూత బంగరు సీత 

మిగిలిన వలపేలే...

రామా లీల ప్రేమజ్వాలా 

రగిలిన బ్రతుకేలే

ఆ..ఆ...రాలు పూత బంగరు సీత 

మిగిలిన వలపేలే


మనసు పడ్డ మనిషే దేవుడు 

శిలగా నిలిచాడూ...

చూపులకే ఊపిరి పోసి 

చీకటి కోలిచాడూ...

ఎడారిలో కోయిల ఉన్నా 

ఆ దారికి రాదు వసంతం...

మనిషైనా మాకైనా.. 

అనుభవమొకటే...


పదే పదే పాడుతున్నా 

పాడిన పాటే....

అది బ్రతుకో... పాటో.. 

నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... 

పాడిన పాటే...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి