7, ఆగస్టు 2025, గురువారం

హరినామమే కడు ఆనందకరము | Harinamame Kadu Anandakaramu | Song Lyrics | Annamayya (1997)

హరినామమే కడు ఆనందకరము 



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎం ఎం కీరవాణి, 

       అనురాధ పాలకుర్తి, ఆనంద్ భట్టాచార్య  


సంకీర్తనలు:


గోవిందాశ్రిత గోకుల బృంద

పావన జయజయ పరమానందా

గోవిందాశ్రిత గోకుల బృంద

పావన జయజయ పరమానందా...


హరినామమే కడు ఆనందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా

హరినామమే కడు ఆనందకరము

మరుగవో మరుగవో మరుగవో మనసా

హరినామమే కడు ఆనందకరము


రంగ రంగ

రంగ రంగ రంగపతి రంగనాధ

నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ

రంగ రంగ రంగపతి రంగనాధ

నీ సింగరాలే తరచాయ శ్రీరంగనాధ

రంగనాధ శ్రీరంగనాధ రంగనాధ శ్రీరంగనాధ


వేదములు సూతింపగా 

వేడుకలు దైవారాగా

ఆదరించి దాసులా 

మోహన నరసింహుడు

మోహన నరసింహుడు 

మోహన నరసింహుడు


కట్టెదుర వైకుంఠము 

కాణాచయినా కొండ

తెట్టెలాయే మహీమెలె

తిరుమల కొండ తిరుమల కొండ

కట్టెదుర వైకుంఠము 

కాణాచయినా కొండ

తెట్టెలాయే మహీమెలె

తిరుమల కొండ తిరుమల కొండ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి