10, ఆగస్టు 2025, ఆదివారం

బ్రహ్మ కడిగిన పాదము | Brahma kadigina Padamu | Song Lyrics | Annamayya (1997)

బ్రహ్మ కడిగిన పాదము



చిత్రం : అన్నమయ్య (1997)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

రచన : అన్నమాచార్య సంకీర్తనలు 

గానం : కె ఎస్ చిత్ర, సుజాత, పూర్ణ చందర్, 

       అనురాధ పాలకుర్తి, శ్రీరామ్, రాధిక,   


పల్లవి :


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము


చరణం 1 :



చెలగి వసుధ గొలిచిన నీ పాదము 

బలి తల మోపిన పాదము

తలకగా గగనము తన్నిన పాదము

తలకగా గగనము తన్నిన పాదము 

బలారిపు గాచిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము


చరణం 2 :


పరమయోగులకు పరిపరి విధముల 

పారమొసగెడి నీ పాదము

తిరువెంకటగిరి తిరమని చూపిన 

పరమ పదము నీ పాదము


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి