20, ఆగస్టు 2025, బుధవారం

అదే నాకు అంతు తెలియకున్నది | Ade Naaku Antuteliyakunnadi | Song Lyrics | Ramudu Bheemudu (1964)

అదే నాకు అంతు తెలియకున్నది



చిత్రం :  రాముడు-భీముడు (1964)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


అహా హ హా అహా హ హ 

అహా హ హా అహా హ హ

అదే.. అదే.. అదే... 

నాకు అంతు తెలియకున్నది

ఏదో లాగు మనసు లాగుతున్నది

అదే.. అదే.. అదే... 

నాకు అంతు తెలియకున్నది

ఏదో లాగు మనసు లాగుతున్నది


అదే అదే అదే......

అహా హ హా అహా హ హ 

అహా హ హా అహా హ హ

అహా హ హ అహా హ హ అహా


అదే అదే అదే.. 

వింత నేను తెలుసుకున్నది

అదే నీ వయసులోన ఉన్నది

అదే అదే అదే.. 

వింత నేను తెలుసుకున్నది

అదే నీ వయసులోన ఉన్నది 


చరణం 1 :


నీ నడకలోన రాజహంస 

అడుగులున్నవి

నీ నవ్వులోన సన్నజాజి 

పువ్వులున్నవి

అహా హ హ అహా హ హా 

అహా హ హ

నీ నడకలోన రాజహంస 

అడుగులున్నవి

నీ నవ్వులోన సన్నజాజి 

పువ్వులున్నవి


ఏమేమి ఉన్నవి.. 

ఇంకేమి ఉన్నవి

ఏమేమి ఉన్నవి.. 

ఇంకేమి ఉన్నవి

ఈ వేళ నా పెదవులేల 

వణుకుతున్నవి


అదే అదే అదే వింత 

నేను తెలుసుకున్నది

అదే నీ వయసులోన ఉన్నది


చరణం 2 :


నీ చేయి తాకగానె ఏదొ 

హాయి రగిలెను

ఓయీ అని పిలవాలని 

ఊహ కలిగెను

అహా హ హ అహా హ హా 

అహా హ హ

నీ చేయి తాకగానె ఏదొ 

హాయి రగిలెను

ఓయీ అని పిలవాలని 

ఊహ కలిగెను


ఏమేమి ఆయెను 

ఇంకేమి ఆయెను

ఏమేమి ఆయెను 

ఇంకేమి ఆయెను

ఈ వేళ లేత బుగ్గలెంత 

కందిపోయెను


అదే.. అదే.. అదే...

నాకు అంతు తెలియకున్నది

ఏదో లాగు మనసు 

లాగు చున్నది

అదే అదే అదే వింత 

నేను తెలుసుకున్నది

అదే నీ వయసులోన ఉన్నది

అదే.. అదే.. అదే...

వింత నేను తెలుసుకున్నది

 

- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి