27, జులై 2025, ఆదివారం

మధురాతి మధురం మన ప్రేమ | Madhurati Madhuram | Song Lyrics | Jeevitha Chakram (1971)

మధురాతి మధురం మన ప్రేమ మధువు



చిత్రం: జీవిత చక్రం (1971) 

సంగీతం: శంకర్ జైకిషన్ 

గీతరచయిత: ఆరుద్ర 

నేపధ్య గానం: ఘంటసాల, శారద 


పల్లవి: 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


చరణం 1: 


నిను వీణ చేసి .. కొనగోట మీటి .. 

అనురాగ గీతాలే .. పలికించనా 

ఆ పాటలోని .. భావాలు నీవై .. 

నీలోని వలపు .. నాలోన నిలుపు 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


చరణం 2: 


చిరు కోర్కెలేవో ..చిగురించ సాగే .. 

ఎదలోన ఆశా ... ఊరించ సాగే 

నీ ఆశలెన్ని .. విరబూయగానే .. 

పూమాల చేసి .. మెడలోన వేతు 


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


చరణం 3: 


నా గుడిలోనా .. గుడి కట్టినానూ 

గుడిలోన దేవతలా .. నివసించవా 

గుడిలోన ఉన్నా .. ఏద మీద ఉన్నా .. 

నీ దేవి .. నీ కొరకే .. జీవించునులే ..


మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండలేదు .. తమి తీరలేదు 

మధురాతి మధురం మన ప్రేమ మధువు 

మది నిండునోయి .. తమి చేరునోయి 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి