30, జూన్ 2025, సోమవారం

ఇది తీయని వెన్నెల రేయి | Idi Teeyani Vennela Reyi | Song Lyrics | Prema Lekhalu (1977)

ఇది తీయని వెన్నెల రేయి



చిత్రం :  ప్రేమలేఖలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత : ఆరుద్ర

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


ఇది తీయని వెన్నెల రేయి... 

మది వెన్నెల కన్నా హాయి

నా ఊహల జాబిలి రేఖలు... 

కురిపించెను ప్రేమలేఖలు


ఇది తీయని వెన్నెల రేయి... 

మది వెన్నెల కన్నా హాయి


చరణం 1 :


ఆ... హా హా హా... ఆహా... ఆహాహా...

సుజా... 

నడిరాతిరి వేళ నీ పిలుపు.. 

గిలిగింతలతో నను ఉసిగొలుపు

నడిరాతిరి వేళ నీ పిలుపు.. 

గిలిగింతలతో నను ఉసిగొలుపు

నును చేతులతో నను పెనవేసి.. 

నా ఒడిలో వాలును నీ వలపు


ఇది తీయని వెన్నెల రేయి... 

మది వెన్నెల కన్నా హాయి


చరణం 2 :


నా మనసే కోవెల చేసితిని.. 

ఆ గుడిలో నిన్నే నిలిపితిని

నా మనసే కోవెల చేసితిని.. 

ఆ గుడిలో నిన్నే నిలిపితిని

నీ ఒంపులు తిరిగే అందాలు.. 

కనువిందులు చేసే శిల్పాలు


ఇది తీయని వెన్నెల రేయి... 

మది వెన్నెల కన్నా హాయి


చరణం 3 :


నీ పెదవులు చిలికే మధురిమలు.. 

అనురాగము పలికే సరిగమలు

నీ పెదవులు చిలికే మధురిమలు.. 

అనురాగము పలికే సరిగమలు

మన తనువులు కలిపే రాగాలు.. 

కలకాలం నిలిచే కావ్యాలు


ఇది తీయని వెన్నెల రేయి... 

మది వెన్నెల కన్నా హాయి

నా ఊహల జాబిలి రేఖలు... 

కురిపించెను ప్రేమలేఖలు.. 

ప్రేమలేఖలు


ఇది తీయని వెన్నెల రేయి... 

మది వెన్నెల కన్నా హాయి 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి