30, జూన్ 2025, సోమవారం

ఎంత నేర్చినా ఎంత నేర్చినా | Entha Nerchina | Song Lyrics | Seetharama Kalyanam (1986)

ఎంత నేర్చినా ఎంత నేర్చినా



చిత్రం : సీతారామకళ్యాణం (1986)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


ఎంత నేర్చినా...  ఎంత నేర్చినా

ఎంత చూచినా... ఎంత చూచినా

ఎంత వారలైన... ఎంత వారలైన

కాంత దాసులే... ప్రేమ దాసులే


ఆ.. ఆ.. ఆ.. కాదమ్మా..

ప్రేమదాసులే కాదు.. కాంతదాసులే

కాదు సార్.. ప్రేమ దాసులే

తప్పమ్మా.. తప్పదు సార్


అంతేనంటావా.. 


ఎంత నేర్చినా ఎంత చూచినా

ఎంత వారలైన ప్రేమ దాసులే... 

ఎంత నేర్చినా


సంతతంబు శ్రీకాంత స్వాంత 

సిద్ధాంతమైన మార్గ

చింత లేని వా...రెంత నేర్చినా 


సంతతంబు ఏకాంత సెవకై

ఇంత తంతు చేసి చెంత చేరు 

వా..రెంత నేర్చినా 


ఎంత చూచినా

ఎంత వారలైన ప్రేమ దాసులే

ఎంత నేర్చినా.... 


చరణం 1 :


లయ లేనిదే స్వరముండునా.. 

స్వరరాగములు లేక పాటుండునా

నువు లేనిదే నేనుండునా.. 

నా మనసు నిను వీడి బ్రతికుండునా


రాముడు విలు వంచి... 

సీతను పెండ్లాడె కదా

పార్వతి తపియించి 

పరమేశుని పొందెగదా

ఆ పాటి మనమైనా తెగియించమా


ఎంత నేర్చినా...  ఎంత చూచినా

ఎంత వారలైన ప్రేమ దాసులే

ఆ.. ఆ.. ఎంత నేర్పినా...  


చరణం 2 :


ముద్దున్నది.. పొద్దున్ననది

అధరాలు అదిరదిరి పడుతున్నవి


తలపున్ననది.. తలుపున్నది

గడివేస్తే ఇరుకైన గది ఉన్నది


ఇల్లే గుడి కన్నా మనకెంతో పదిలంగా

పెద్దలు ఇద్దరినీ ఇటులెంతో భద్రంగా

కలిపారు సరదాల చెరసాలలో


ఎంత నేర్చినా...  ఎంత చూచినా

ఎంత వారలైన ప్రేమ దాసులే

ఎంత నేర్చినా... 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి