17, ఏప్రిల్ 2025, గురువారం

మల్లెపూల మా రాణికి | Mallepoola Maraniki | Song Lyrics | Amarajeevi (1983)

మల్లెపూల మా రాణికి 



చిత్రం: అమరజీవి (1983)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు


పల్లవి:


మల్లెపూల మా రాణికి 

బంతిపూల పారాణి

మల్లెపూల మా రాణికి 

బంతిపూల పారాణీ

గున్నమావి పందిళ్ళలోనా ... 

కన్నెజాజి ముంగిళ్ళలోనా...

కోకిలమ్మ పాట కచేరీ


మల్లెపూల మా రాణికి 

బంతిపూల పారాణీ

గున్నమావి పందిళ్ళలోనా ... 

కన్నెజాజి ముంగిళ్ళలోనా...

కోకిలమ్మ పాట కచేరీ


చరణం 1:


పొగడపూలైనా పోగడే అందాలే 

మురిసే మలిసంధ్య వేళలో

మల్లె మందారం పిల్లకి సింగారం 

చేసే మధుమాసవేళలో

నా.... ఆలాపనే.. 

నీ.... ఆరాధనై... 

చిరంజీవిగా దీవించనా... 

హ్యాపీ బర్డే టూ యూ


మల్లెపూల మా రాణికి 

బంతిపూల పారాణీ

గున్నమావి పందిళ్ళలోనా ... 

కన్నెజాజి ముంగిళ్ళలోనా...

కోకిలమ్మ పాట కచేరీ


చరణం 2:


రెల్లు చేలల్లో రేయివేళల్లో 

కురిసే వెన్నెల్ల నవ్వుతో

పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ 

మురిసే ముత్తైదు శోభతో

నీ.... సౌభాగ్యమే.. 

నా.... సంగీతమై

ఈ జన్మకీ... జీవించనా...  

హ్యాపీ బర్డే టూ యూ


మల్లెపూల మా రాణికి 

బంతిపూల పారాణీ

గున్నమావి పందిళ్ళలోనా ... 

కన్నెజాజి ముంగిళ్ళలోనా... 

కోకిలమ్మ పాట కచేరీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి