16, ఏప్రిల్ 2025, బుధవారం

బృందావనమొక ఆలయము | Brindavanamoka Alayamu | Song Lyrics | Bhale Krishnudu (1980)

బృందావనమొక ఆలయము



చిత్రం :  భలే కృష్ణుడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి : 

ఆ...ఆ...ఆ.. ఆ..
బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు


బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు

Happy birthday to you daddy.. 
Happy birthday to you daddy.. 


చరణం 1 :


ఎన్నో.. ఇంకెన్నో 
ఇలాంటి రోజులు రావాలి... 
మేం చూడాలి

మా డాడీ మాతో 
ఆడుతు పాడుతూ ఉందాలి.. 
మేం చూడాలి

అమ్మనాన్నకు అరవై ఏళ్లకు 
మళ్ళీ పెళ్ళి జరిగే రోజున
నవ్వే నిండు నవ్వే ఇంటి నిండా 
వెలుగు కావాలి...


బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు

Happy birthday to you daddy.. 
Happy birthday to you daddy.. 


చరణం 2 :


సిరులు.. సంపదలు.. 
చిరకాలం మీరై పెరగాలి.. 
మేం చూడాలి

మా ఆశలు మీలో 
పువ్వులుపిందెలు తొడగాలి.. 
మేం పండాలి

భువిపై స్వర్గం బృందావనమై.. 
రోజూరోజు పండుగ రోజై
మీరు.. మీకు మేము.. మాకు మీరు.. 
కను విందు కావాలి 

బృందావనమొక ఆలయము.. 
మాధవుడందలి దైవము
అటు ఇటు రెండు దీపాలు.. 
ఆ దేవుని ప్రేమకు రూపాలు


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి