అసుర సంధ్య వేళ
చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
సాకి :
శ్రీ రంగనాధ చరణారవింద
చారణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు
నుదుట దాల్చిన ముగ్ధ మోహన
సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి...
నీ అడుగుదమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజలకు పువ్వుగా..
జపములకు మాలగా..
పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను..
ఉరమునను..
ఇహమునకు... పరమునకు
నీదాననై.. ధన్యనై..
జీవన వదాన్యనై తరియించుదాన..
మన్నించవే... మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియసేవిక ..
దేవ దేవి. .
పల్లవి :
అసుర సంధ్య వేళ
ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామి...
ముసురుకున్న మమతలతో..
కొసరిన అపరాధమేమి?
స్వామీ... స్వామీ... స్వామీ
అసుర సంధ్య వేళ
ఉసురు తగలనీకు దేవి ..
స్వామి ఉసురు తగలనీకు దేవి..
మరులుకొన్న హరిని వీడి...
మరలిన ఈ నర జన్మ మేమి ..
దేవి ..దేవి... దేవీ..
చరణం 1 :
హరి హర సుర జ్యేష్ఠాదులు..
కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జ్యేష్ఠాదులు..
కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను తెలిసి..
నీమ నిష్ఠలకు అలసి
పూనిన శృంగార యోగమిది కాదని ..
నను కాదని..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ..
పడకు పెడదారి
అసుర సంధ్య వేళ
ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామి...
అసుర సంధ్య వేళ
ఉసురు తగలనీకు దేవి ..
స్వామి ఉసురు తగలనీకు దేవీ..
చరణం 2 :
నశ్వరమది..నాటక మిది...
నాలుగు గడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే...
కావేరికి రూపు ఉన్నది
రంగని కీర్తన చేసే
రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట
రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ...
అసుర సంధ్య వేళ
ఉసురు తగలనీకు దేవీ ..
స్వామి ఉసురు తగలనీకు దే..వీ...
చరణం 3 :
అలిగేనిట శ్రీరంగము..
తొలగేనట వైకుంఠము
యాతన కేనా దేహము?...
ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము...
వీక్షణమే మరు దాహము
రంగా! రంగా...
రంగ రంగ శ్రీ రంగ !!
ఎటులోపను...ఎటులాపను?
ఒకసారి.. అ.. అ..
అనుభవించు ఒడి చేరి..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి