తాతా.. బాగున్నావా
చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం : బాలు
పల్లవి :
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా
కంగారుగున్నావు ఖంగుతింటున్నావు..
కంగారుగున్నావు ఖంగుతింటున్నావు
ముడుచుకొనున్నావు మూలకూర్చొన్నావు..
తాత
కంగారు గున్నావు ఖంగుతింటున్నావు..
కంగారు గున్నావు ఖంగుతింటున్నావు
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా
చరణం 1 :
మీసాలు మెలివేస్తే వేళ్ళు నోప్పెడతాయి
కస్సు బుస్సు మని చూస్తే కళ్ళేర్ర బడతాయి
మీసాలు మెలి వేస్తే వేళ్ళు నోప్పెడతాయి
కస్సు బుస్సు మని చూస్తే కళ్ళేర్ర బడతాయి
విసురగ నడిచినచో కాలుజారి పడతావు
విసురగ నడిచినచో కాలుజారి పడతావు
చేసినదానికి చెంపలేసుకొని..
వచ్చేయి మాదారి లేకుంటే గోదారి
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా
చరణం 2 :
రాముడ్ని ఎదిరి౦చి రావణుడేమయ్యాడు..
కృష్ణుడ్ని అదిలించి కంసుడు ఏమయ్యాడు
రాముడ్ని ఎదిరి౦చి రావణుడేమయ్యాడు..
కృష్ణుడ్ని అదిలించి కంసుడు ఏమయ్యాడు
నీ కంటే గొప్పోళ్ళు నీళ్ళుగారి పోయారు..
నీ కంటే గొప్పోళ్ళు నీళ్ళుగారి పోయారు
నీకున్న పరువె౦త నీకున్న బలమెంత..
మా దండు కదిలిందా నీ పని గోవిందా
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా
చరణం 3 :
నా అంతు చూస్తానని రంకెలు వేశావే..
ఊరంత నాదేనని విర్రవీగి పోయావే
నా అంతు చూస్తానని రంకెలు వేశావే..
ఊరంత నాదేనని విర్రవీగి పోయావే
వచ్చాను మొనగాణ్ణి వరుసకు మనవడ్ని
వచ్చాను మొనగాణ్ణి వరుసకు మనవడ్ని
తాతకు దగ్గులు నేర్పే దాకా నిద్దురపోను..
నిన్నోదిలిపోను
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా
తాతా.. బాగున్నావా..
ఏం తాతా బాగున్నావా..
తా తా తా తా తా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి