18, మార్చి 2025, మంగళవారం

తకధిమితక ధిమితకధిమి | Takadhimi Taka | Song Lyrics | Idi Katha Kaadu (1979)

తకధిమితక ధిమితకధిమి



చిత్రం: ఇది కథ కాదు (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, రమోల 


పల్లవి :  


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్ 

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  పమ్‌పమ్


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  పమ్‌పమ్


తకధిమితక ధిమితకధిమి 

తకధిమితక ధిం ధిం

జత జతకొక కత ఉన్నది 

చరితైతే జం జం

తకధిమితక ధిమితకధిమి 

తకధిమితక ధిం ధిం

జత జతకొక కత ఉన్నది 

చరితైతే జం జం


ఒక ఇంటికి ముఖద్వారం 

ఒకటుంటే అందం

ఒక మనసుకి ఒక మనసని 

అనుకుంటే స్వర్గం

ఒక ఇంటికి ముఖద్వారం 

ఒకటుంటే అందం

ఒక మనసుకి ఒక మనసని 

అనుకుంటే స్వర్గం


తకధిమితక ధిమితకధిమి 

తకధిమితక ధిం ధిం

జత జతకొక కత ఉన్నది 

చరితైతే జం జం 


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  రపమ్‌పమ్


చరణం 1 :


ఈ లోకమొక ఆట స్థలము...  

ఈ ఆట ఆడేది క్షణము

ఈ లోకమొక ఆట స్థలము...  

ఈ ఆట ఆడేది క్షణము

ఆడించువాడెవ్వడైనా...  

ఆడాలి ఈ కీలుబొమ్మ

ఆడించువాడెవ్వడైనా...  

ఆడాలి ఈ కీలుబొమ్మ


ఇది తెలిసీ తుది తెలిసీ 

ఇంకెందుకు గర్వం

తన ఆటే గెలవాలని 

ప్రతి బొమ్మకు స్వార్థం

ఇది తెలిసీ తుది తెలిసీ 

ఇంకెందుకు గర్వం

తన ఆటే గెలవాలని 

ప్రతి బొమ్మకు స్వార్థం


తకధిమితక ధిమితకధిమి 

తకధిమితక ధిం ధిం

జత జతకొక కత ఉన్నది 

చరితైతే జం జం 


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  పమ్‌పమ్


చరణం 2 :


వెళ్తారు వెళ్ళేటివాళ్ళు...  

చెప్పేసెయ్ తుది వీడుకోలు

ఉంటారు ఋణమున్నవాళ్ళు...  

వింటారు నీ గుండె రొదలు

కన్నీళ్ళ సెలయేళ్ళు 

కాకూడదు కళ్ళు

కలలన్నీ వెలుగొచ్చిన 

మెలుకువలో చెల్లు 


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  రపమ్‌పమ్


చరణం 3 : 


ఏనాడు గెలిచింది వలపు...  

తానోడుటే దాని గెలుపు

ఏనాడు గెలిచింది వలపు...  

తానోడుటే దాని గెలుపు

గాయాన్ని మాన్పేది మరుపు...  

ప్రాణాన్ని నిలిపేది రేపు

గాయాన్ని మాన్పేది మరుపు...  

ప్రాణాన్ని నిలిపేది రేపు


ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు

ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు

ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు


తకధిమితక ధిమితకధిమి 

తకధిమితక ధిం ధిం

జత జతకొక కత ఉన్నది 

చరితైతే జం జం

ఒక ఇంటికి ముఖద్వారం 

ఒకటుంటే అందం

ఒక మనసుకి ఒక మనసని 

అనుకుంటే స్వర్గం


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  పమ్‌పమ్


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక 

కుకుమల్లెటిక చమ్‌చమ్

మేరిపపిమిట  మేరిపపిమిట 

మేరిపపిమిట  పమ్‌పమ్


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి