13, మార్చి 2025, గురువారం

తహ తహ మని ఊపిరంత | Taha tahamani oopirantha | Song Lyrics | Ame Katha (1977)

తహ తహ మని ఊపిరంత 



చిత్రం : ఆమె కథ (1977)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే... 

చూపులన్ని ఆకలైతే

తపించాను నీవే ప్రాణమై..

ఆ... ఆ.. ఆ... 

తపించాను నీవే ప్రాణమై


తడి పొడి తడి వెన్నెలేదో వెచ్చనైతే... 

మల్లెపూల వేసవైతే

జపించాను నీవే ధ్యానమై..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

జపించాను నీవే ధ్యానమై


జబు జబు జబు జబు జబురే..

హహహహహ..

జబు జబు జబు జబురే

జబు జబు జబు జబు జబురే..

హహహహహ..

జబు జబు జబు జబ్ 


చరణం 1 :


చుక్క పొడుస్తే చిలిపిగ నన్నే 

చూసినట్లు ఉంది

చురకలు వేసినట్లు ఉంది


గులాబి రెమ్మా గుచ్చుకొంటే 

గిచ్చినట్లు ఉంది

ముద్దులు ఇచ్చినట్లు ఉంది


మాపటేల అవుతుంటే.. హాయ్ 

మల్లెపూలు నవుతుంటే

మాపటేల అవుతుంటే..ఏ..

మల్లెపూలు నవుతుంటే

మసకలోన వయసు మనసు.. 

కలిసి మెలిసి బుసకొడుతుంటే


అర్ధరాత్రి అవుతున్నా... 

ఆటవిడుపు లేకున్నా

మరులకన్నా సిరిలే లేవులే 


తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే.. 

చూపులన్ని ఆకలైతే

జపించాను నీవే ధ్యానమై..

ఆ ఆ ఆ ఆ.. 

జపించాను నీవే ధ్యానమై 


జబు జబు జబు జబు జబురే..

హహహహహ..

జబు జబు జబు జబెరే

జబు జబు జబు జబు జబురే..

హహహహహ..

జబు జబు జబు జబ్ 


చరణం 2 : 


మిడిసిపడే నీ అందం కడలి 

పొంగల్లే ఉంది..

ఒడిసి పట్టాలని ఉందీ

ఎంత తీరినా తీరని కోరిక 

వెన్నెల కాసింది..

అయినా ఎండల్లే ఉంది


పాత కొత్తలవుతుంటే.. 

కొత్త వింతలవుతుంటే

పాత కొత్తలవుతుంటే..ఏ.. 

కొత్త వింతలవుతుంటే

జవనాలే పవనాలై... 

మరువలేని మరువాలైతే


ఎంత చేరువౌవుతున్నా... 

ఎంత కలిసి పోతున్నా

మనువులోని తనివే తీరదు


తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే... 

చూపులన్ని ఆకలైతే

జపించాను నీవే ధ్యానమై..

ఆ ఆ ఆ ఆ... 

జపించాను నీవే ధ్యానమై 


జబు జబు జబు జబు జబురే..

హహహహహ..

జబు జబు జబు జబెరే

జబు జబు జబు జబు జబురే..

హహహహహ..

జబు జబు జబు జబ్

చుపు చుపు చుపురే..

ఆ హహహహ..

చుపు చుపు చుపురే 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి