12, మార్చి 2025, బుధవారం

రామ సుగుణధామ | Rama Sugunadhama | Song Lyrics | LavaKusa (1963)

రామ సుగుణధామ



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :   లీల, సుశీల


పల్లవి :


రామ సుగుణధామ 

రఘువంశ జలధిసోమా...

శ్రీ రామ సుగుణధామా

సీతామనోభిరామా 

సాకేతసార్వభౌమా

శ్రీ రామ సుగుణధామా 


చరణం 1 :


మందస్మిత సుందర 

వదనారవింద రామా

ఇందీవర శ్యామలాంగ 

వందితసుత్రామా

మందార మరందోపమ 

మధుర మధుర నామా

మందార మరందోపమ 

మధుర మధుర నామా


శ్రీ రామ సుగుణధామా 

రఘువంశ జలధిసోమా...

శ్రీ రామ సుగుణధామా 


చరణం 2 :


అవతారపురుష 

రావణాది దైత్యవి రామా

నవనీత హృదయ 

ధర్మనిరత రాజల రామా

పవమాన తనయ సన్నుత 

పరమాత్మ పరంధామా

పవమాన తనయ సన్నుత 

పరమాత్మ పరంధామా


శ్రీ రామ సుగుణధామ 

రఘువంశ జలధిసోమా

సీతామనోభిరామా... 

సాకేతసార్వభౌమా...

సీతామనోభిరామా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి