10, ఫిబ్రవరి 2025, సోమవారం

నాయుడోళ్ళింటికాడ | Nayudollintikada | Song Lyrics | Andaru Dongale (1974)

నాయుడోళ్ళింటికాడ 



చిత్రం :  అందరూ దొంగలే (1974)

సంగీతం : కె. వి. మహదేవన్

గీతరచయిత : కొసరాజు

నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ  


పల్లవి :


నాయుడోళ్ళింటికాడ .. 

నల్లతుమ్మ చెట్టుకింద

నాయుడేమన్నాడె పిల్లా..  

అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా


నాయుడోళ్ళింటికాడ..  

నల్లతుమ్మ చెట్టుకింద

నాయుడేమన్నాడె పిల్లా.. 

అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా..


హా.. నాయుడోళ్ళింటికాడ..  

నల్లతుమ్మ చెట్టుకింద

గుట్టు బైట పెట్టడే అప్పుడూ..  

అబ్బ గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ


హా.. నాయుడోళ్ళింటికాడ..  

నల్లతుమ్మ చెట్టుకింద

గుట్టు బైట పెట్టడే అప్పుడూ..  

అబ్బ గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ  


చరణం 1 :


ఎలా ఎలా అన్నాడు...  

ఏమి చెయమన్నాడూ ?

మల్లెమొగ్గలాంటి పిల్ల 

ఒళ్ళోన వాలుతుంటె

జారుకోమన్నాడా..  

జుర్రుకోమన్నాడా?

జారుకోమన్నాడా...  

జుర్రుకోమన్నాడా?

నాయుడేమన్నాడె పిల్లా... 

అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా..


వాలుకన్నుల చిన్నదాన్ని...  

వదలకూడదు అన్నాడూ

ఇంత కన్నా మంచిరోజు...  

ఎప్పుడూ రాదన్నాడూ

చెయ్యి వెయ్యమన్నాడూ... 

అయ్యయ్యో... 

చెప్పగూడదన్నాడూ

చెయ్యి వెయ్యమన్నాడూ... 

చెప్పగూడదన్నాడూ

నాయుడోళ్ళింటికాడ...  

నల్లతుమ్మ చెట్టుకింద

గుట్టు బైట పెట్టడే అప్పుడూ...  

అబ్బ...  గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ..  


చరణం 2 : 


కల్లబొల్లి సాకులన్ని 

కట్టిపెట్టమన్నాడా?

కంటి సైగ తెలుసుకొని 

కలుసుకోమన్నాడా?

పిట్ట పడతదన్నాడా.. 

వీపు చెడతదన్నాడా?

పిట్ట పడతదన్నాడా...  

వీపు చెడతదన్నాడా?  

నాయుడేమన్నాడె పిల్లా...  

అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా 


సందెపొద్దుదాక నీతో సరసమాడి ... 

సందడేమీ చెయ్యకుండ 

ఉండమన్నాడూ

మనసులోని మోజుదీర మాటలాడి... 

తొందరేమి చెయ్యకుండ 

ఆగమన్నాడూ

దారి చూడమన్నాడు... 

అమ్మమ్మా.. 

దౌడు తీయమన్నాడూ

అరెరే . . దారి చూడమన్నాడు...

దౌడు తీయమన్నాడూ 


నాయుడోళ్ళింటికాడ 

నల్లతుమ్మ చెట్టుకింద

నాయుడేమన్నాడె పిల్లా...  

అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా.. 


నాయుడోళ్ళింటికాడ 

నల్లతుమ్మ చెట్టుకింద

గుట్టు బైట పెట్టడే అప్పుడూ... 

అబ్బ గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ.. 


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి