19, జనవరి 2025, ఆదివారం

ఏటి ఒడ్డున కూర్చుంటే | Yeti odduna kurchunte | Song Lyrics | Ida Lokam (1973)

ఏటి ఒడ్డున కూర్చుంటే 



చిత్రం: ఇదా లోకం (1973) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: సి నారాయణ రెడ్డి   

నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల 


పల్లవి: 


ఏటి ఒడ్డున కూర్చుంటే...

ఏరు గల గలమంటుంటే... 

ఏటి ఒడ్డున కూర్చుంటే...

ఏరు గల గలమంటుంటే... 


నీటిలో మన నీడలు రెండూ...

వాటేసుకుపోతూ ఉంటే 

నీటిలో మన నీడలు రెండూ...

వాటేసుకుపోతూ ఉంటే... 


ఓ యమ్మ..ఓ యమ్మ 

ఓ యమ్మాయి జాణెడు దూరం.. 

ఓపలేకపోతున్నాను ఓ యమ్మా 


ఓ యబ్బ ఓ యబ్బాయి 

పిడికెడు మనసూ... 

ఆపలేక నేనున్నాను 

ఓ యబ్బా హోయ్... 


చరణం 1: 


పిల్లగాలీ వీస్తుంటే... 

ఒళ్లు జల జలమంటుంటే.. 

పిల్లగాలీ వీస్తుంటే ...

ఒళ్లు జల జలమంటుంటే... 

నిన్ను నీవే నీ కౌగిలిలో...

నిన్ను నీవే నీ కౌగిల్లో.. 

నన్ను మరచి ...హత్తుకుంటే.... 


ఓ యమ్మ.. ఓ యమ్మాయి 

జాణెడు దూరం.. 

ఓపలేకపోతున్నాను ఓ యమ్మా... 

ఓ యబ్బ ఓ యబ్బాయి 

పిడికెడు మనసూ... 

ఆపలేక నేనున్నాను 

ఓ యబ్బా హోయ్... 


చరణం 2: 


చీకటి పాకుతు వస్తుంటే.... 

చెరొక ఇంటికి వెళ్ళాలంటే.... 

చీకటి పాకుతు వస్తుంటే.... 

చెరొక ఇంటికి వెళ్ళాలంటే.... 

మళ్ళీ కలిసేదెప్పుడని నీ కళ్ళు 

దిగులుగ చూస్తుంటే... 

కళ్లల్లో కనిపించే దిగులే కలగా 

వస్తుందనుకుంటే... 


ఓ యమ్మ.. 

ఓ యమ్మ.. ఓ యమ్మాయి 

జాణెడు దూరం.. 

ఓపలేకపోతున్నాను... ఓ యమ్మా 


ఓ యబ్బ.. ఓ యబ్బాయి.. 

పిడికెడు మనసూ... 

ఆపలేక నేనున్నాను 

ఓ యబ్బా హోయ్... 


ఓ యమ్మ..ఓ యమ్మ..

ఓ యబ్బా..ఓ యబ్బా 

ఓ యమ్మా..ఓ యమ్మ..

ఓ యబ్బా..ఓ యబ్బా 

ఓ యమ్మా..ఓ యమ్మ...ఓ యబ్బా 

లాలా..ల..లా ల.ల ..లా... 

లాలా..ల..లా ...లల్ల..లా.. ..లా... 

ఊహు..ఊహు..ఊహు.. 

ఊహు..ఊహు..ఊహు...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి