6, జనవరి 2025, సోమవారం

వాడుక మరచెద వేల | Vaduka Marachedavela | Song Lyrics | Pelli Kanuka (1960)

వాడుక మరచెద వేల



చిత్రం :  పెళ్లి కానుక (1960)

సంగీతం :  ఏ.ఎం. రాజ

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఏ. ఎం. రాజ, సుశీల


పల్లవి:


వాడుక మరచెద వేల 

నను వేడుక చేసెద వేల

నిను చూడని దినము 

నాకోక యుగము

నీకు తెలుసును నిజము 

నీకు తెలుసును నిజము


వాడుక మరువను నేను 

నిను వేడుక చెయగ లేను

నిను చూడని క్షణము 

నాకొక దినము

నీకు తెలుసును నిజము 

నీకు తెలుసును నిజము


చరణం : 1


సంధ్య రంగుల చల్లని గాలుల..

మధుర రాగము మంజుల గానము

సంధ్య రంగుల చల్లని గాలుల..

మధుర రాగము మంజుల గానము

తేనె విందుల తీయని కలలు.. 

మరచి పోయిన వేళ

ఇక మనకీ మనుగడ యేల

ఈ అందము చూపి 

డెందము వూపి..

ఆశ రేపెద వేల.. 

ఆశ రేపెద వేల


ఓ... సంధ్య రంగులు సాగినా..

చల్ల గాలులు ఆగినా

కలసి మెలసిన కన్నులలోన..

మనసు చూడగ లేవా 

మరులు తోడగ లేవా


వాడుక మరువను నేను 

నిను వేడుక చెయగ లేను

నిను చూడని క్షణము 

నాకొక దినము

నీకు తెలుసును నిజము 

నీకు తెలుసును నిజము 


చరణం :  2


కన్నులా ఇవి కలల వెన్నెలా..

చిన్నె వన్నెల చిలిపి తెన్నులా

కన్నులా ఇవి కలల వెన్నెలా..

చిన్నె వన్నెల చిలిపి తెన్నులా

మనసు తెలిసి మర్మమేల...

ఇంత తొందర యేలా.. 

ఇటు పంతాలాడుట మేలా

నాకందరి కన్నా ఆశలు వున్నా...

హద్దు కాదనగలనా.. 

హద్దు కాదనగలనా


వాడని నవ్వుల తోడ.. 

నడయాడెడు పువ్వుల జాడ

అనురాగము విరిసి 

లొకము మరచి..

ఏకమౌదము కలసీ 

ఏకమౌదము కలసి 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి