19, జనవరి 2025, ఆదివారం

నిత్య సుమంగళి నీవమ్మా | Nitya Sumangali Neevamma | Song Lyrics | Ida Lokam (1973)

నిత్య సుమంగళి నీవమ్మా



చిత్రం :  ఇదా లోకం (1973)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల, బి. వసంత


పల్లవి :


నిత్య సుమంగళి నీవమ్మా....

నిత్య సుమంగళి నీవమ్మా... 

నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా

ఇది లోకులు ఎరుగని నిజమమ్మా.. 

నీ ఇన్నేళ్ళ కన్నీళ్ళే ఋజువమ్మా  

నిత్య సుమంగళి నీవమ్మా... 


చరణం 1 :


అమ్మా... నాన్న వచ్చారు... 

నీకు పూలు గాజులు తెచ్చారు

అమ్మా... నాన్న వచ్చారు... 

నీకు పూలు గాజులు తెచ్చారు

మోడు చిగురులు వేసిందీ... 

కాడు పూతోట అయ్యింది

మోడు చిగురులు వేసిందీ... 

కాడు పూతోట అయ్యింది


విధి ఓడిపోయి జరుగని వింతే జరిగింది... 

నిత్యసుమంగళి నీవమ్మా.... 


చరణం 2 :


మీ పెళ్ళికి యిరవై ఏళ్ళ వయసట...  

మీ పెళ్ళికి యిరవై ఏళ్ళ వయసట

పండుగ చేయాలనుకున్నాము


పీటలపైనా కూర్చొండి.. 

మాలలు ఇద్దరు మార్చండి

పీటలపైనా కూర్చొండి.. 

మాలలు ఇద్దరు మార్చండి  


ఎన్నాళ్ళకమ్మా.. ఎన్నేళ్ళకమ్మా...

ఎన్నాళ్ళకమ్మా... ఎన్నేళ్ళకమ్మా

కన్నుల కింతటి పండుగ... 

మా కన్నుల కింతటి పండుగ...

నిన్నూ.... నాన్నను

నిన్నూ నాన్నను చూశామొకటిగా... 

అనురాగం త్యాగం ఆలుమగలుగా    

 

నిత్య సుమంగళి నీవమ్మా.. 

నీ పసుపు కుంకుమ చెదరనిదమ్మా

ఇది లోకులు ఎరుగని నిజమమ్మా....  

నీ ఇన్నేళ్ళ కన్నీళ్ళే ఋజువమ్మా

నిత్యసుమంగళి నీవమ్మా. . .  


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి