నీవు నా పక్కనుంటే హాయి
చిత్రం : శివమెత్తిన సత్యం (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఏసుదాస్, వాణీ జయరాం
పల్లవి :
నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా
ఎన్నో..ఎన్నో..ఎన్నో..
కిరణాలు మెరిశాయి
నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..
కిరణాలు మెరిశాయి
నీవు నా పక్కనుంటే హాయీ
చరణం 1 :
కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
అనురాగ శిఖరాన అందాల తోట
అనురాగ శిఖరాన అందాల తోట
ఆ చోట కోనేట సయ్యటలాడాలీ..
నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..
కిరణాలు మెరిశాయి
నీవు నా పక్కనుంటే హాయీ
చరణం 2 :
కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన..ఆ..ఆ..
కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన
కన్ను సైగల కౌగిలింతల
సన్నజాజి తావీ
ఎన్ని మారులు నిన్ను చూసినా
దేవ రంభ ఠీవీ
మువ్వల రవళీ మోహన మురళీ..
మువ్వల రవళీ మోహన మురళీ
మధురం మధురం మానస కేళీ..
నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..
కిరణాలు మెరిశాయి
నీవు నా పక్కనుంటే హాయీ
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి