గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్
చిత్రం : శివమెత్తిన సత్యం (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఏసుదాస్, వాణీ జయరాం
పల్లవి :
గీతా.. ఓ గీతా... డార్లింగ్.... మై డార్లింగ్.....
మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ
మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ
రాజా... ఓ రాజా.. డార్లింగ్.... ఓ మై డార్లింగ్..
మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ
చరణం 1 :
పరదేశంలో ఆవేశంతో...
ప్రేమించిన మనకనుమతి..
బహుమతీ...
ఈ దేశంలో సంతోషంతో...
మనువాడినతో...
అనుబందం... ఆనందం...
వెచ్చనీ... వలపుల ముచ్చటా తీరునూ
అనురాగబంధం ముడివేసుకోనీ..
అనురాగబంధం ముడివేసుకోనీ
రాజా...ఓ..రాజా... డార్లింగ్..ఓ మై డార్లింగ్...
మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ
చరణం 2 :
చిరునవ్వులతో పులకింతలతో..
వికసించిన ఒక మధువనం..
యవ్వనం
ఈ భంగిమలో..
నీ పొంగులతో మురిపించే బిగి కౌగిలీ..
జిలిబిలి
ఊహలే రేగితే.. మోహమే ఆగునా... ఆ..ఆ..ఆ
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ
గీతా.... ఓ.... గీతా...
డార్లింగ్.... మై డార్లింగ్...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ...
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి