21, జనవరి 2025, మంగళవారం

గారడి చేసే కన్నులతో | Garadi Chese Kannulatho | Song Lyrics | Adapaduchu (1967)

గారడి చేసే కన్నులతో



చిత్రం : ఆడపడుచు (1967)

సంగీతం : టి. చలపతి రావు

గీతరచయిత : దాశరథి 

నేపధ్య గానం : టి. ఆర్. జయదేవ్, సుశీల 


పల్లవి :


గారడి చేసే కన్నులతో 

నన్నారడి చేసేవెందుకనీ

ఎందుకనీ..ఎందుకనీ


చిలిపి చిలిపి నీ చేతలతో 

నను కలవరపరచే వెందుకనీ

ఎందుకనీ..ఎందుకనీ..


చరణం 1 :


రారమ్మని నే పిలవగనే.. 

రానని మారాం చేసేవు

ఎందుకనీ... ఎందుకనీ


గారాలొలికే చెక్కిలిపై 

నేరం చేయగ తలచేవు

ఎందుకనీ... ఎందుకనీ


గారడి చేసే కన్నులతో 

నన్నారడి చేసేవెందుకనీ

ఎందుకనీ... ఎందుకనీ


చిలిపి చిలిపి నీ చేతలతో 

నను కలవరపరచే వెందుకనీ

ఎందుకనీ..ఎందుకనీ..


చరణం 2 :


జడలో పూవులు తురుమగనే 

తడబడి దూసుకుపోయేవు

ఎందుకనీ... ఎందుకనీ


పూవులు తురుమే సాకులతో 

నా నవ్వును దోచగ తలచేవూ

ఎందుకనీ... ఎందుకనీ


గారడి చేసే కన్నులతో 

నన్నారడి చేసేవెందుకనీ

ఎందుకనీ... ఎందుకనీ


చిలిపి చిలిపి నీ చేతలతో 

నను కలవరపరచే వెందుకనీ

ఎందుకనీ..ఎందుకనీ..


చరణం 3 :


నీ పాదాలే సోకిన చోట 

నిగనిగలాడేను ఈ తోటా

ఎందుకనీ... ఎందుకనీ


నను కాపాడే నీ నీడే 

అందాలొలికేను నా మేడ

ఎందుకనీ... ఎందుకనీ


గారడి చేసే కన్నులతో 

నన్నారడి చేసేవెందుకనీ

ఎందుకనీ... ఎందుకనీ


చిలిపి చిలిపి నీ చేతలతో 

నను కలవరపరచే వెందుకనీ

ఎందుకనీ..ఎందుకనీ..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి