11, డిసెంబర్ 2024, బుధవారం

నను మరువని దొరవని తెలుసు | Nanu Maruvani Doravani | Song Lyrics | Rajakota Rahashyam (1971)

నను మరువని దొరవని తెలుసు



చిత్రం : రాజకోట రహస్యం (1971)

సంగీతం :  విజయా కృష్ణమూర్తి

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


సాకి : 


తొలి సిగ్గుల తొలకరిలో 

తలవాల్చిన చంద్రముఖి

తెరలెందుకు నీకు నాకు 

దరి జేరవె ప్రియసఖి


పల్లవి : 


నను మరువని దొరవని తెలుసు

నను మరువని దొరవని తెలుసు

నా మదిలోన ఏముందొ 

అది నీకు తెలుసు


నను వలచిన చెలివని తెలుసు

నను వలచిన చెలివని తెలుసు

నా ఎదలోన ఏముందొ 

అది నీకు తెలుసు


నను వలచిన చెలివని తెలుసు 


చరణం 1:


చెంపల కెంపులు దోచాలని .. 

సంపంగి నవ్వులు దూయాలని

ఆ .. ఆ .. ఆ


చెంపల కెంపులు దోచాలని .. 

సంపంగి నవ్వులు దూయాలని

నడుమున చేయి వేసి నడవాలని...

నా .. నడుమున చేయి వేసి నడవాలని

అంటుంది అంటుంది 

నీ కొంటె వయసు ...


నను వలచిన చెలివని తెలుసు

నా ఎదలోన ఏముందొ 

అది నీకు తెలుసు

నను వలచిన చెలివని తెలుసు...  


చరణం 2:


నీ రాజు తోడుగ నిలవాలని ... 

ఈ ఏడు లోకాల గెలవాలని

ఆ .. ఆ .. ఆ


నీ రాజు తోడుగ నిలవాలని ... 

ఈ ఏడు లోకాల గెలవాలని

బ్రతుకే పున్నమి కావాలని....

నీ ...బ్రతుకే పున్నమి కావాలని

కోరింది కోరింది నీ లేత వయసు ...


నను మరువని దొరవని తెలుసు

నా మదిలోన ఏముందొ 

అది నీకు తెలుసు

నను వలచిన చెలివని తెలుసు


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి