20, డిసెంబర్ 2024, శుక్రవారం

ఇది ఒక నందనవనము | Idi oka Nandana Vanamu | Song Lyrics | Adavi Donga (1985)

ఇది ఒక నందనవనము



చిత్రం :  అడవి దొంగ (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి : 


ఇది ఒక నందనవనము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

మనసులు కలిపిన దినము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


తరుల గిరుల ఋతు శోభలతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

తరుణ హరిణ జతి నాట్యముతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


కొతకొత్తపాటలెన్నో కోయిలమ్మ 

నేర్చుకున్న వేళా..

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


చరణం 1 :


ఏటిలోని తీట నీరు 

ఏనుగమ్మ లాలపోసే... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

చుర్రుమన్న కొండ ఎండ 

ఎర్రననైన బొట్టు పెట్టే...  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


చిలక గోపికలు చీరకట్టినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

పాలపిట్టలిడ గూడు కట్టినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


చెవులపిల్లి చెప్పుకున్న 

ఊసువిన్నది.. 

కోతిబావ చెప్పుకుంది 

చెయ్యమన్నది

హేయ్.. చేసుకో వేడిగా వేడుకా...

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


ఇది ఒక నందనవనము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

మనసులు కలిపిన దినము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


చరణం 2 : 


ఒంటి మీద చెయ్యి వేస్తే 

వయసుకొక్క ఊపు వచ్చే... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

ఊపు మీద నిన్ను చూస్తే 

రేపు లేని రేతిరొచ్చే... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


సిగనుపువ్వులే చెదిరిపోయినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

సిగ్గుమరకలే చెరిగిపోయినవి... 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


పోనుపోను గుట్టు 

నాకు దక్కుతున్నది... 

రాను రాను పట్టు 

నాకు తప్పుతున్నది

హేయ్.. తీరనీ తీయనీ కోరికా..

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


ఇది ఒక నందనవనము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

మనసులు కలిపిన దినము.. 

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


తరుల గిరుల ఋతు శోభలతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా

తరుణ హరిణ జతి నాట్యముతో..  

ఉవ్వా..ఉవువ్వా.. ఉవ్వా..ఉవువ్వా


కొతకొత్తపాటలెన్నో కోయిలమ్మ 

నేర్చుకున్న వేళా..

ఉవ్వా..ఉవ్వా.. ఉవువ్వా.. 

ఉవ్వా ఉవ్వా..ఉవువ్వా 


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి