1, డిసెంబర్ 2024, ఆదివారం

ఇది మతికి మనసుకు పోరాటం | Idi Mathiki Manasuku | Song Lyrics | Akka Chellelu (1970)

ఇది మతికి మనసుకు పోరాటం



చిత్రం : అక్కాచెల్లెలు (1970)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల  


సాకీ : 


న్యాయానికి బంధిగా... 

న్యాయమూర్తి వెళుతున్నాడమ్మా... ఆ

నీ మాంగళ్యాన్ని... 

ఈ మానవన్యాయం సవాలు చేసిందమ్మా


పల్లవి :  


ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..

మనిషితో దేవుని చెలగాటం..చెల్లి

ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..

మనిషితో దేవుని చెలగాటం..చెల్లి


అటు నమ్మిన సత్యం... 

ఇటు పెంచిన రక్తం

అడకత్తెరలో పడిపోయినది... ధర్మం

అటు నమ్మిన సత్యం... 

ఇటు పెంచిన రక్తం

అడకత్తెరలో పడిపోయినది... ధర్మం


ఇది మతికి మనసుకు పోరాటం తల్లి..

మనిషితో దేవుని చెలగాటం... చెల్లి


చరణం 1 :


నీవు నేర్పిన నీతి నియమం... 

నీకే ఎదురై నిలిచిందా

నీవు నేర్పిన నీతి నియమం... 

నీకే ఎదురై నిలిచిందా


నీ పసుపు కుంకుమలనే  

బలి కోరిందా..ఆ

నీ పసుపు కుంకుమలనే 

బలి కోరిందా..


ఇది నీతికి నెలవూ... 

లేదది నీతికి తావూ..ఊ

కంచే చేనును మేస్తుందా... 

కన్నతల్లి కడుపునే కోస్తుందా


ఇది  మతికి మనసుకు పోరాటం తల్లి..

మనిషితో దేవుని చెలగాటం... చెల్లి

మనిషితో దేవుని చెలగాటం... చెల్లి


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి