22, డిసెంబర్ 2024, ఆదివారం

పండగొచ్చెనమ్మ | సంక్రాంతి పాట | Sankranthi Song | Lyrics | RKSS Creations

పండగొచ్చెనమ్మ - సంక్రాంతి పాట


రచన : రామకృష్ణ దువ్వు  

 

పల్లవి:

 

పండగొచ్చెనమ్మ సంకురాత్రి పండగ

పల్లెకొచ్చెనమ్మ పట్టనంత వేడుక

కన్నవాళ్ళ చేతి ముద్ద ప్రీతిగ తినగ

బాలమిత్రులంతా కలసి హాయి మిగుల

పండగొచ్చెనమ్మ సంకురాత్రి పండగ

 

చరణం 1

 

భోగిమంటల్లో చలికాచుకొని,

ముగ్గుల రేఖల రంగులు పూసి,

గడప గడపలో దీపాలు వెలిగి,

గోవుల శాలల మువ్వల సందడి,

పూర్ణకుంభ పూజలు పెంగిపొరలి

గంగిరెద్దుల మేళం ఊరంతా తిరిగి,

ఆనంద పంటలతో ఊరంత హర్షం,

సంక్రాంతి పండగ పంచు అనందం

 

పండగొచ్చెనమ్మ సంకురాత్రి పండగ

పల్లెకొచ్చెనమ్మ పట్టనంత వేడుక

కన్నవాళ్ళ చేతి ముద్ద ప్రీతిగ తినగ

బాలమిత్రులంతా కలసి హాయి మిగుల

పండగొచ్చెనమ్మ సంకురాత్రి పండగ

 

చరణం 2:

 

కోడి పందేల గోల పొలాల్లలో పూసె,

పిల్లల ఆటలతో నవ్వులు విరిసె.

బాలల శిరమున రేగుపళ్ళ చిలుకు

ఎద్దుల కొమ్మలు రంగుల పూతలు,

సూర్యుని ప్రీతికి ఉత్సవ శోభలు,

హరిదాసు కీర్తనల్లో మురిసేటి వీధులు,

చలి గాలులు హాయిగా ఒంటిని తాకగ

సంక్రాంతి వేడుక మనసును నిలచుగా

 

పండగొచ్చెనమ్మ సంకురాత్రి పండగ

పల్లెకొచ్చెనమ్మ పట్టనంత వేడుక

కన్నవాళ్ళ చేతి ముద్ద ప్రీతిగ తినగ

బాలమిత్రులంతా కలసి హాయి మిగుల

పండగొచ్చెనమ్మ సంకురాత్రి పండగ

 

- RKSS Creations...

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి