ఉంటే ఈ ఊళ్ళో ఉండు
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల ఉన్నావంటే..
చూడకుండా ప్రాణ ముండదురా..ఆ
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
చరణం 1 :
కూలికెళ్తే నాకే రారా..
చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా..
తోడువుంటాది
కూలికెళ్తే నాకే రారా..
చేను ఉన్నాది
కూడు తింటే నాతో తినరా..
తోడువుంటాది
ఇంకేడకైనా ఎల్లావంటే..ఏ.. ఏ..
ఇంకేడకైనా ఎల్లావంటే
నాది చుప్పనాతి మనసు..
అది నీకు తెలుసు
నాది చుప్పనాతి మనసు..
అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
చరణం 2 :
ఊరినిండా వయసు పిల్లలు..
ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే..
వదలనంటారు
ఊరినిండా వయసు పిల్లలు..
ఒంటిగున్నారు
వాటమైనవాడ్ని చూస్తే..
వదలనంటారు
నీ చపల బుద్ది సూపావంటే..ఏ... ఏ..
మనిషి నాకు దక్కవింక..
మంచిదాన్ని కాను ఆనక
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
చరణం 3 :
పగటిపూట పనిలో పడితే..
పలకనంటావు
రాతిరేళ రహస్యంగా..
రాను జడిసేవు
పగటిపూట పనిలో పడితే..
పలకనంటావు
రాతిరేళ రహస్యంగా..
రాను జడిసేవు
నే తెల్లవార్లు మేలుకుంటే..
నే తెల్లవార్లు మేలుకుంటే
ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి..
ఏమేమో అనుకొని
ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి..
ఏమేమో అనుకొని
ఈది ఈది.. కుళ్ళుకుంటాది
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల ఉన్నావంటే..
చూడకుండా ప్రాణ ముండదురా..ఆ
ఉంటే ఈ ఊళ్ళో ఉండు..
పోతే మీ దేశం పోరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి