1, నవంబర్ 2024, శుక్రవారం

తేట తేట తెలుగులా | Teta Teta Telugula | Song Lyrics | Premanagar (1971)

తేట తేట తెలుగులా



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:


తేట తేట తెలుగులా... 

తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. 

కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. 

కనుల ముందరా..


తేట తేట తెలుగులా... 

తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. 

కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. 

కనుల ముందరా..


చరణం 1:


తెలుగువారి ఆడపడుచు ఎంకిలా

ఎంకి కొప్పులోని.. 

ముద్దబంతి పువ్వులా

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా

ఎంకి కొప్పులోని.. 

ముద్దబంతి పువ్వులా


గోదారి కెరటాల గీతాల వలే నాలో

పలికినది..... పలికినది.... పలికినది


చల్లగా చిరుజల్లుగా... 

జల జల గల గలా

కడలి వచ్చింది కన్నె అప్సరా

వచ్చి నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... 

తెల్లవారి వెలుగులా...


చరణం 2:


రెక్కలొచ్చి ఊహలన్ని 

ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని 

చుక్కలతో చెక్కుతున్నవి

రెక్కలొచ్చి ఊహలన్ని 

ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని 

చుక్కలతో చెక్కుతున్నవి


లోలోన.. నాలోన.. 

ఎన్నెన్నో రూపాలు

వెలసినవి..... వెలసినవి... వెలసినవి...

వీణలా.. నెరజాణలా... 

కల కల.. గల గలా

కదలి వచ్చింది కన్నె అప్సరా

ఎదుట నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... 

తెల్లవారి వెలుగులా...


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి