6, నవంబర్ 2024, బుధవారం

పుట్టిన రోజు జేజేలు | Puttina Roju Jejelu | Song Lyrics | Bangaru Kalalu (1974)

పుట్టిన రోజు జేజేలు



చిత్రం :  బంగారు కలలు (1974)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి   


చరణం 1 :


కళ కళలాడే నీ కళ్ళు 

దేవుడి ఇళ్ళమ్మా

కిల కిల నవ్వే నీ మోము 

ముద్దుల మూటమ్మా


కళ కళలాడే నీ కళ్ళు 

దేవుడి ఇళ్ళమ్మా

కిల కిల నవ్వే నీ మోము 

ముద్దుల మూటమ్మా


నీ కొసమే నే జీవించాలి . . 

నీవే పెరిగీ నా ఆశలు తీర్చాలీ    

  

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి 


చరణం 2 :


ఆటలలో చదువులలో 

మేటిగ రావాలీ

మంచితనానికి మారుపేరుగా 

మన్నన పొందాలీ


చీకటి హృదయంలో 

వెన్నెల కాయాలీ

నా బంగారుకలలే 

నిజమై నిలవాలీ  


పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి 


చరణం 3 :


నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు 

నాథుడు కావాలీ

నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు 

నాథుడు కావాలీ

నీ సంసారం పూలనావలా 

సాగిపోవాలీ

నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలీ.. 

నిన్నే తలచీ నే పొంగిపోవాలీ  


పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి

నీకు యెటేటా యిలాగే పండగ జరగాలీ

పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి