నీలో నాలో మోహాలెన్నో
చిత్రం : ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ధీంతణక ధీం... ధీంతణక ధీం...
ధీంతణక ధీం... ధీంతణక ధీం...
షబరిబా.. షబరిబా
తత్తరతా.. తరెత్తరా..
నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే...
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే...
నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే...
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే...ఏ..ఏ
పొంగదా యవ్వనం...
చిందదా తొలిసుఖం
యవ్వనం.. తొలిసుఖం..
ఈ క్షణం.. చెరి సగం
పొంగదా యవ్వనం...
చిందదా తొలిసుఖం.. హా
చరణం 1 :
అపురూపాల చెలి రూపము... హా.. హా..
అనురాగానికే శిల్పము.. హా.. హా
దేవలోక అమృతాలు ఒలికించు అధరం...
పాల బుగ్గ వెన్నెల్లో వర్షించు సమయం...
బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు..
ఇక ఎవరికైన అవుతుంది గుండెగుబులు
బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు..
ఇక ఎవరికైన అవుతుంది గుండెగుబులు
పొంగదా.. హా.. యవ్వనం... హా..
చిందదా తొలిసుఖం
యవ్వనం.. తొలిసుఖం..
ఈ క్షణం.. చెరి సగం
చరణం 2 :
ధీంతణక ధీం... ధీంతణక ధీం...
ధీంతణక ధీం... ధీంతణక ధీం...
పాల పొంగంటి నా పరువమూ.. హే.. హేహే
రగిలి రాసింది రసకావ్యాము.. హా.. హహహా..
ఆడుతుంది కోడెనాగు చిన్నారి నీ చేతిలో
చిన్నవాడి చూపు కూడా
చురుక్కుమంది ఈ వేడిలో
నిద్దర ఎరగని తలపులివి...
తొలి ముద్దుల పండగ కోరినవి
నిద్దర ఎరగని తలపులివి...
తొలి ముద్దుల పండగ కోరినవి
నీలో నాలో మోహాలెన్నో మొగ్గలేస్తే...
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే...ఏ..ఏ
పొంగదా యవ్వనం...
చిందదా తొలిసుఖం
లలలా.. లలలా.. లలలా.. లలలా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి