18, నవంబర్ 2024, సోమవారం

హృదయమనే కోవెలలో | Hrudayamane kovelalo | Song Lyrics | Premasagaram (1983)

హృదయమనే కోవెలలో



చిత్రం :  ప్రేమసాగరం (1983)

సంగీతం :  టి. రాజేందర్

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  రమేశ్ 


పల్లవి :


హృదయమనే కోవెలలో 

నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే 

నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...


హృదయమనే కోవెలలో 

నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే 

నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...


చరణం 1 :


దేవత నీవని తలచీ...  

కవితను నేను రచించా

దేవత నీవని తలచీ...  

కవితను నేను రచించా

అనురాగాలే మలిచీ...  

ధ్యానం చేసి పిలిచా


నీ చెవికది చేరకపోతే...  

నీ చెవికది చేరక పోతే

జీవితమే మాయని చింతే...  

జీవితమే మాయని చింతే


హృదయమనే కోవెలలో 

నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే 

నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...


చరణం 2 :


నా ప్రేమకు నీరే సాక్షం...  

నీ కోపము నిప్పుల సాక్షం

నా ప్రేమకు నీరే సాక్షం...  

నీ కోపము నిప్పుల సాక్షం

నీటికి నిప్పులు ఆరూ...  

నీ కోపం ఎప్పుడు తీరు?


నీ ప్రేమే కరువైపోతే.... 

నీ ప్రేమే కరువైపోతే

నే లోకము విడిచిపోతా...  

లోకము విడిచిపోతా 


హృదయమనే కోవెలలో 

నిను కొలిచానే దేవతగా

ఒక వెల్లువగా పాడెదనే 

నీ తలపులనే పల్లవిగా

నీ తలపులనే పల్లవిగా...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి