3, నవంబర్ 2024, ఆదివారం

ఎవరికోసం ఎవరికోసం | Evarikosam Evarikosam | Song Lyrics | Premanagar (1971)

ఎవరికోసం ఎవరికోసం



చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  ఘంటసాల


పల్లవి:


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..

ఈ శూన్యనందనం

ఈ భగ్న హృదయం ..

ఈ అగ్ని గుండం

ఎవరికోసం ..ఎవరికోసం.. 

ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 1:


ప్రేమభిక్ష నువ్వే పెట్టీ

ఈ పేద హృదయం పగులగొట్టీ

పిచ్చివాణ్ణి పాత్రలేని 

బిచ్చగాణ్ణి చేశావు

నువ్వివనిదీ తాకలేనూ ..

ఇంకెవరినీ అడుగలేనూ

బ్రతుకు నీకు ఇచ్చాను.. 

చితిని నాకు పేర్చావు


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..

ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. 

ఎవరికోసం.. ఎవరికోసం ??


చరణం 2:


ఓర్వలేని ఈ ప్రకృతి 

ప్రయళంగా మారనీ

నా దేవి లేని ఈ కోవెల 

తునాతునకలై పోనీ

కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...

కాలిపోయి బూడిదే మిగలనీ


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..

ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. 

ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 3:


మమత నింపమన్నానూ .. 

మనసు చంపుకొన్నావూ

మధువు తాగనన్నాను .. 

విషం తాగమన్నావూ

నీకు ప్రేమంటే నిజం కాదూ ...

నాకు చావంటే భయంలేదూ

నీ విరహంలో బ్రతికానూ ...

ఈ విషంతో మరణిస్తానూ ...

మరణిస్తానూ..  


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి