15, అక్టోబర్ 2024, మంగళవారం

వరించి వచ్చిన మానవ వీరుడు | Varinchi Vachina Manava Veerudu | Song Lyrics | Jagadekaveeruni Katha (1961)

వరించి వచ్చిన మానవ వీరుడు 



చిత్రం: జగదేకవీరుని కథ (1961)

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 

గీతరచయిత: పింగళి నాగేంద్రరావు   

నేపధ్య గానం: పి.లీల, సుశీల,


పల్లవి :


వరించి వచ్చిన మానవ వీరుడు 

ఏమైనాడని విచారమా

ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ


అయితే వినవే మా మాట 

అయితే వినవే మా మాట


చరణం 1 :


నీవు చేసిన మాయలు మించి 

నవ మన్మధుడే ఆయెనే

అహ నవ మన్మధుడే ఆయెనే

మన్మధుడై నిన్నావేశించి 

మైమరపించేనే హలా

నిను మైమరపించేనే హలా 


వరించి వచ్చిన మానవ వీరుడు 

ఏమైనాడని విచారమా

ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ


అయితే వినవే మా మాట 

అయితే వినవే మా మాట


చరణం 2 :


అలగిన చెలిని లాలన శాయా 

మలయానిలుడే ఆయెనే

ఓహో మలయానిలుడై 

చల్లగ వలుపులు విసిరినే హలా

అహ వలుపులు విసిరేనే హలా


వరించి వచ్చిన మానవ వీరుడు 

ఏమైనాడని విచారమా

ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ


అయితే వినవే మా మాట 

అయితే వినవే మా మాట


చరణం 3 :


చెలి అడుగులలో పూలు చల్లగా 

లలిత వసంతుడె ఆయెనే

అహ లలిత వసంతుడె ఆయెనే

వసంతుడై నిను కోయిల పాటల 

చెంతకు పిలిచేనే హలా

తన చెంతకు పిలిచేనే హలా


వరించి వచ్చిన మానవ వీరుడు 

ఏమైనాడని విచారమా

ఔన చెలీ ఔన సఖీ ఔన చెలీ ఔన సఖీ


అయితే వినవే మా మాట 

అయితే వినవే మా మాట


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి