1, అక్టోబర్ 2024, మంగళవారం

తొలిసారి నిన్నూ చూశాను నేను | Tolisari Ninnu Chusanu Nenu | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

తొలిసారి నిన్నూ చూశాను నేను



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


ఊ...ఊ...ఊ..హా..ఊ..

లా..అహా...ఆ

తొలిసారి నిన్నూ చూశాను నేను..

నీ ప్రేమ పాశం లాగింది నన్నూ..

లాగింది నన్నూ...

ఏ తారలోనూ నీ తీరూ లేదు..

ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..

లేదు..లేదు


చరణం 1:


నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి..

తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు

నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి..

తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు


ఏ తారలోనూ నీ తీరూ లేదు..

ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..

లేదు..లేదు


చరణం 2:


నీ చక్కనైన మేనులోని ఛాయ జూసీ..

చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు


ఏ తారలోనూ నీ తీరూ లేదు..

ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..

లేదు..లేదు..


చరణం 3:


ఏ సుందరిలో కానరాని సోయగాలు..

ఏ వయ్యారిలో లేని అందచందాలూ

ఏ సుందరిలో కానరాని సోయగాలు..

ఏ వయ్యారిలో లేని అందచందాలూ..


తనలోన కలిగి..మనసార వలచే..

చినదానికోసం వెతికేను నేను..

నేను..నేను


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి