21, అక్టోబర్ 2024, సోమవారం

తెల్లవారనీకు ఈ రేయిని | Tellavaraneeku Ee Reyini | Song Lyrics | Atma Balam (1964)

తెల్లవారనీకు ఈ రేయిని



చిత్రం: ఆత్మబలం (1964)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


తెల్లవారనీకు ఈ రేయిని... 

తీరిపోనీకు ఈ తీయనీ హాయిని

తెల్లవారనీకు ఈ రేయిని..

తీరిపోనీకు ఈ తీయనీ హాయిని...

తెల్లవారనీకు ఈ రేయిని...


చరణం 1:


నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..

ఆ కైపులో లోకాలే మరువనీ...

నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..

ఆ కైపులో లోకాలే మరువనీ..


మనసులో మనసునై మసలనీ..

మనసులో మనసునై మసలనీ..

నీ మనిషినై మమతనై మురిసిపోనీ...


తెల్లవారనీకు ఈ రేయిని..

తీరిపోనీకు ఈ తీయని హాయిని..

తెల్లవారనీకు ఈ రేయిని..


చరణం 2:


నీ కురులే చీకటులై కప్పివేయని..

ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..

నీ కురులే చీకటులై కప్పివేయని..

ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..


నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ..

నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ

తడియారని హృదిలో 

నను మొలకలెత్తని..ఈ..ఈ..


తెల్లవారనీకు ఈ రేయిని..

తీరిపోనీకు ఈ తీయనీ హాయిని...

తెల్లవారనీకు ఈ రేయిని


చరణం 3:


మల్లెపూల తెల్లదనం మనసు నిండని

అల్లరి పడుచుదనం కొల్లబోనీ..

మల్లెపూల తెల్లదనం మనసు నిండని

అల్లరి పడుచుదనం కొల్లబోనీ..


కొల్లగొన్న మనసే నా ఇల్లని

కొల్లగొన్న మనసే నా ఇల్లని

చల్లగా కాపురమూ ఉండిపోనీ...


తెల్లవారనీకు ఈ రేయిని... 

తీరిపోనీకు ఈ తీయని హాయిని..

తెల్లవారనీకు ఈ రేయిని..


- పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి