22, అక్టోబర్ 2024, మంగళవారం

గుర్తుకొస్తున్నాయి | Gurthukostunnayi | Song Lyrics | Naa Autograph (2004)

గుర్తుకొస్తున్నాయి



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)

సంగీతం: కీరవాణి

గీతరచయిత: చంద్రబోస్

నేపధ్య గానం: కృష్ణకుమార్ 


పల్లవి:


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏమూలనో

నిదురించు జ్ఞాపకాలూ 

నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


ఈగాలిలో ఏమమతలో

మా అమ్మ మాటలాగా 

పలకరిస్తున్నాయి...

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


చరణం 1:


మొదట చూసినా 

టూరింగ్ సినిమా

మొదట మొక్కినా 

దేవుని ప్రతిమా


రేగుపళ్ళకై పట్టిన కుస్తీ

రాగిచెంబుతో చేసిన ఇస్త్రీ

కోతికొమ్మలో బెణికిన కాలు

మేకపొదుగులో తాగిన పాలూ

దొంగచాటుగా కాల్చిన బీడీ

సుబ్బుగాడిపై చెప్పిన చాడీ

మోటబావిలో మిత్రుని మరణం

ఏకధాటిగా ఏడ్చిన తరుణం...


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


చరణం 2:


మొదటిసారిగా గీసిన మీసం

మొదట వేసినా ద్రౌపది వేషం

నెలపరీక్షలో వచ్చిన సున్నా

గోడకుర్చి వేయించిన నాన్న

పంచుకున్న ఆ పిప్పరమెంటు

పీరు సాయిబూ పూసిన సెంటూ

చెడుగుడాటలో గెలిచిన కప్పు

షావుకారుకెగవేసిన అప్పు


మొదటి ముద్దులో 

తెలియని తనమూ

మొదటి ప్రేమలో 

తియ్యందనమూ...


గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


ఎదలోతులో ఏమూలనో

నిదురించు జ్ఞాపకాలూ 

నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి 

గుర్తుకొస్తున్నాయి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి