8, అక్టోబర్ 2024, మంగళవారం

చెంగు చెంగు ముద్దాడంగ | Chengu Chengu Muddadanga | Song Lyrics | Muddula Mavayya (1989)

చెంగు చెంగు ముద్దాడంగ



చిత్రం : ముద్దుల మావయ్య (1989)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి :


చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

చెంగున దూకే ఒయ్యారంగా...  

తొలి పొంగుల గంగ

చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

కొంగే దోచే శృంగారంగా...  

ఈ ముద్దుల దొంగ


చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

కొంగే దోచే శృంగారంగా...  

ఈ ముద్దుల దొంగ 


చరణం 1 : 


అందాలు దాచి పెట్టి ఊరిస్తే పాపం

అందిస్తే తీరుతుంది సందిట్లో తాపం

ఒళ్ళంతా కళ్ళు జేసి వెయ్యోద్దు తాళం

ముళ్ళంటి చూపుతోటి తీయొద్దు ప్రాణం


వయసేమో రెగుతుంది...  

చకచకచెమ్మచెక్క

మనసేమో ఆగమంది.. 

చకచకచమ్మచక్క 


ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు

పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు

ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు

పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు

ఈ పొద్దే మన ముద్దు 

ఇక హద్దు పొద్దు వద్దే వద్దు


చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

చెంగున దూకే ఒయ్యారంగా...  

తొలి పొంగుల గంగ

చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

కొంగే దోచే శృంగారంగా...  

ఈ ముద్దుల దొంగ


చరణం 2 : 


గారాలు పొంగు వేళ గోరంత ముద్దు

కోరింది కొంగుజోల గోరింటపొద్దు

చీరల్లే చుట్టేనమ్మా నీ చూపు నేడు

ఆరాలు తీసేనమ్మ  మారాల ఈడు


తియ్యంగా కొంటెరంగ...  

చక చక చెమ్మచెక్క

తీరాలి సామిరంగ...  

చక చక చెమ్మచెక్క


చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా

అందాల కన్నెసోకు హారతిచ్చేనా

చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా

అందాల కన్నెసోకు హారతిచ్చేనా

సందిళ్ళే పందిళ్ళు 

ఈ అల్లరి మల్లెల జల్లులోన


చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

చెంగున దూకే ఒయ్యారంగా...  

తొలి పొంగుల గంగ

చెంగు చెంగు ముద్దాడంగ...  

చల్ మోహనరంగ

కొంగే దోచే శృంగారంగా...  

ఈ ముద్దుల దొంగ 


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి