21, ఆగస్టు 2024, బుధవారం

తహతహ తాకిడి తాకిన సోకుల | Taha Taha Takidi | Song Lyrics | Amma Donga (1995)

తహతహ తాకిడి తాకిన సోకుల 



చిత్రం - అమ్మ దొంగా (1995 )

సాహిత్యం - వేటూరి  

సంగీతం - కోటి,

గానం  : బాలు , చిత్ర, 


పల్లవి: 


తహతహ తాకిడి తాకిన సోకుల 

తామర తంపరలో

తొలితొలి మీగడలంటిన ముద్దుల 

తేనెల తుంపరలో

జతకొద్దీ జంపాలా ఆ ఆ ఆ..హోయ్

చలికొద్దీ చంపాలా ఆ ఆ ఆ....హోయ్..


మనసెజం కలనిజం జుమకు 

జుం జుం జుం

తకిటజం తపనజం బజబజుం 

జుం జుం జుం

తహతహ తాకిడి తాకిన సోకుల 

తామర తంపరలో

తొలితొలి మీగడలంటిన ముద్దుల 

తేనెల తుంపరలో


చరణం 1 :


చలివేస్తే సణక్కురో 

చెలితోనే అతుక్కుపో

కులాసాల మాలా.. 

ఖుషీ మత్తులో

బిడియాల బితుక్కులో 

తడియారే తళుక్కులో


భయాలేల భాలా.. భజానాలలో

జతపడమన్నాయి శకునాలు 

కలబడమన్నాయి నయనాలు

అదిరెను లేలేత అధరాలు

అదుముకుపోతుంటే మధురాలు


చలిమువ్వా గోపాలా...ఆ ఆ ఆ హోయ్

పగటేళే దీపాలా....ఆ ఆ ఆ హోయ్


పరువమే పరిమళం పరవశం 

జుం జుం జుం

చెలియుగం తొలిసుఖం చెరిసగం 

జుం జుం జుం


తహతహ తాకిడి తాకిన సోకుల 

తామర తంపరలో

తొలితొలి మీగడలంటిన ముద్దుల 

తేనెల తుంపరలో


చరణం 2:


చినదాని చిరాకులో 

చిగురించే గులాబిలో

జమాయింపులన్నీ కులాసాలకే

ఉడుకెత్తే వయస్సులో 

ముడిపెట్టే మనస్సులో

నషాళానికంటే రసాలందుకో


సలలిత శృంగార సౌందర్య

మధురస మందార మాధుర్య

ముసి ముసి మోహాల క్రిష్ణయ్య

మురళిని మోగించరాయయ్యా


కుసుమించే మొగ్గమ్మా .... 

హొ హొ హొ హోయ్

కసిపెంచే కన్నయ్యా.......

ఆ ఆ ఆ హోయ్


కలవడం నడుమునే కొలవడం 

జుం జుం జుం

అలగడం వలపుతో నలగడం 

జుం జుం జుం

తహతహ తాకిడి తాకిన సోకుల 

తామర తంపరలో


తొలితొలి మీగడలంటిన ముద్దుల 

తేనెల తుంపరలో

జతకొద్దీ జంపాలా ఆ ఆ ఆ..హోయ్

చలికొద్దీ చంపాలా ఆ ఆ ఆ....హోయ్..


మనసెజం కలనిజం జుమకు 

జుం జుం జుం

తకిటజం తపనజం బజబజుం 

జుం జుం జుం


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి