4, ఆగస్టు 2024, ఆదివారం

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు | Sirimalle sogasu Jabilli Velugu | Song Lyrics | Puttinillu Mettinillu (1973)

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు



చిత్రం  :  పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : ఏ. ఎం. రాజా, సుశీల


పల్లవి:


సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు

నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు

నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ


ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..

నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..

ఈ రేయి నీకోసమే... 


చరణం 1:


పానుపు మురిసింది మన జంట చూసి

వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి

పానుపు మురిసింది మన జంట చూసి

వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి

వలచిన ప్రియునీ..కలసిన వేళ..

వలచిన ప్రియునీ..కలసిన వేళ..

తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు

నీలోనే చూశానులే...

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..


చరణం 2:


దివిలో నెలరాజు దిగివచ్చినాడు..

భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు....

దివిలో నెలరాజు దిగివచ్చినాడు..

భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు...


నీ తోటి చెలిమి..నిజమైన కలిమి

నీ తోటి చెలిమి..నిజమైన కలిమి

నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.


సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు

నీలోనే చూశానులే...

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..

ఈ రేయి నీకోసమే...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి