17, ఆగస్టు 2024, శనివారం

గోపాలరావు గారి అమ్మాయి | Gopalarao gari Ammayi | Song Lyrics | Gopalaraogari Ammayi (1980)

గోపాలరావు గారి అమ్మాయి



చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


గోపాలరావు గారి అమ్మాయి.. 

లోకం తెలియని పాపాయి

గోపాలరావు గారి అమ్మాయి.. 

లోకం తెలియని పాపాయి


దేవులపల్లి కవితల్లే.. 

బాపు గీసిన బొమ్మల్లే

దేవులపల్లి కవితల్లే.. 

బాపు గీసిన బొమ్మల్లే


ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే


గోపాలరావు గారి అమ్మాయి.. 

లోకం తెలియని పాపాయి


చరణం 1 :


శంఖాకారం ఆమె కంఠం... 

శ్రీకారంలా చిన్ని నోరు

శంఖాకారం ఆమె కంఠం... 

శ్రీకారంలా చిన్ని నోరు


ముద్దొచ్చే ఆ లేత పెదవులు... 

కవ్వించే ఆ మేని బరువులు

ఎవరైనా ఎప్పుడైనా.. 

ఎక్కడైనా మీకెదురైతే... ఆమే... ఆమే...


గోపాలరావు గారి అమ్మాయి.. 

లోకం తెలియని పాపాయి


దేవులపల్లి కవితల్లే.. 

బాపు గీసిన బొమ్మల్లే

దేవులపల్లి కవితల్లే.. 

బాపు గీసిన బొమ్మల్లే

ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే


గోపాలరావు గారి అమ్మాయి.. 

లోకం తెలియని పాపాయి


చరణం 2 : 


మనసు చూస్తే మల్లెపువ్వు... 

నవ్విందంటే పాల నవ్వు

మనసు చూస్తే మల్లెపువ్వు... 

నవ్విందంటే పాల నవ్వు


చూసిన కంటికి మరపే రాదు.. 

చూడని కన్ను కన్నే కాదు

ఎవరైనా ఎప్పుడైనా.. 

ఎక్కడైనా మీకెదురైతే... ఆమే... ఆమే...


గోపాలరావు గారి అమ్మాయి.. 

లోకం తెలియని పాపాయి

దేవులపల్లి కవితల్లే.. 

బాపు గీసిన బొమ్మల్లే

ఎవరైనా మీకెదురైతే... ఆమే... 


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి