19, జులై 2024, శుక్రవారం

రెక్కలు తొడిగి రెప రెపలాడి | Rekkalu Thodigi Reparepa ladi | Song Lyrics | Chuttalunnaru Jagratha (1980)

రెక్కలు తొడిగి రెప రెపలాడి 



చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980) 

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత: సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


రెక్కలు తొడిగి రెప రెపలాడి 

రివ్వంటుంది కోరికా.. 

దిక్కులు తోచక చుక్కల దారుల 

చెలరేగింది వేడుకా 

రెక్కలు తొడిగి రెప రెపలాడి 

రివ్వంటుంది కోరికా.. 

దిక్కులు తోచక చుక్కల దారుల 

చెలరేగింది వేడుకా 



వయసు దారి తీసింది... 

వలపు ఉరకలేసింది 

వయసు దారి తీసింది... 

వలపు ఉరకలేసింది 

మనసే వెంబడించింది...

నిమిషమాగకా... 

మనసు వెంబడించిందీ..

నిమిషమాగకా... 


రెక్కలు తొడిగి రెప రెపలాడి 

రివ్వంటుంది కోరికా....

రివ్వంటుంది కోరికా..ఆ..ఆ.. 


చరణం 1: 


చెంతగా... చేరితే....చెంతగా చేరితే.. 

వింతగా ఉన్నదా 

మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా... 

మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా 


నిన్న కలగా ఉన్నది... 

నేడు నిజమౌతున్నది 

నిన్న కలగా ఉన్నది.. 

నేడు నిజమౌతున్నది 

అనుకున్నది అనుభవమైతే 

అంత కన్న ఏమున్నది 


ఆ..వయసు దారి తీసింది... 

వలపు ఉరకలేసింది 

మనసు వెంబడించింది...

నిమిషమాగకా... 

మనసే వెంబడించిందీ..

నిమిషమాగకా... 


రెక్కలు తొడిగి రెప రెపలాడి 

రివ్వంటుంది కోరికా.....

రివ్వంటుంది కోరికా...ఆ..ఆ.. 


చరణం 2: 


కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు 

ఝల్లుమంటున్నది 

గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది... 

గుండెలో చూడకు గుబులుగా ఉన్నది 


తొలి చూపున దాచించి 

మలి చూపున తెలిసింది... 

తొలి చూపున దాచించి 

మలి చూపున తెలిసింది... 

ఆ చూపుల అల్లికలోనే 

పెళ్ళిపిలుపు దాగున్నది... 


ఆ..వయసు దారి తీసింది... 

వలపు ఉరకలేసింది 

మనసు వెంబడించింది...

నిమిషమాగకా... 

మనసే వెంబడించిందీ..

నిమిషమాగకా... 


రెక్కలు తొడిగి రెప రెపలాడి 

రివ్వంటుంది కోరికా.. 

దిక్కులు తోచక చుక్కల దారుల 

చెలరేగింది వేడుకా 


హ..హా...ఆ..ఆ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి