13, జులై 2024, శనివారం

మల్లె కన్న తెల్లన వెన్నెలంత చల్లన | Mallekanna Tellana | Song Lyrics | O Seetha Katha (1974)

మల్లె కన్న తెల్లన వెన్నెలంత చల్లన 



చిత్రం : ఓ సీత కథ (1974)

రచన : సి నారాయణ రెడ్డి,

సంగీతం : K V మహదేవన్, 

గానం : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,


పల్లవి:


మల్లె కన్న తెల్లన....

వెన్నెలంత చల్లన...

ఏది... ఏది.. ఏది..

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..

వెన్నెలంత చల్లన మా సీత సొగసు...


తేనె కన్న తీయన...

పెరుగంత కమ్మన...

ఏది... ఏది.. ఏది..

తేనె కన్న తీయన మా బావ మనసు..

పెరుగంత కమ్మన మా బావ మనసు...


చరణం 1:


నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...

... ఏమని

కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని..

కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని...

నీతోనే ఒక మాట ...నీతోనే ఒక మాట...

చెప్పాలి.... ఏమని

నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని...


మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..

తేనె కన్న తీయన మా బావ మనసు..


చరణం 2:


మనసుంది ఎందుకని... 

మమతకు గుడిగా మారాలని..

వలపుంది ఎందుకని ...

ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..

మనసుంది ఎందుకని... 

మమతకు గుడిగా మారాలని..

వలపుంది ఎందుకని ...

ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..


మనువుంది ఎందుకని.. 

ఆ దివ్వెకు వెలుగై పోవాలని

బ్రతుకుంది ఎందుకని... 

ఆ వెలుగే నీవుగా చూడాలని...

ఆ వెలుగే నీవుగా చూడాలని


మల్లె కన్న తెల్లన...ఊహు..ఊ...

తేనె కన్న తీయన...ఊ..ఊ..ఊ...


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి