17, జులై 2024, బుధవారం

ఏ దివిలో విరిసిన పారిజాతమో | E Divilo Virisina Parijathamo | S Janaki | Song Lyrics | Kanne Vayasu (1973)

ఏ దివిలో విరిసిన పారిజాతమో



చిత్రం : కన్నె వయసు (1973)

సంగీతం : సత్యం

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : S జానకి 


పల్లవి :


ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయెనే


ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయెనే


ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో


చరణం 1 :


పాల బుగ్గలను లేత సిగ్గులు 

పల్లవించగా రావే

నీలి ముంగురులు పిల్ల గాలితో 

ఆటలాడగా రావే

పాల బుగ్గలను లేత సిగ్గులు 

పల్లవించగా రావే

నీలి ముంగురులు పిల్ల గాలితో 

ఆటలాడగా రావే


కాలి అందియలు ఘల్లు ఘల్లుమన 

రాజహంసలా రావే


ఏ దివిలో వెలసిన పారిజాతమో

ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయెనే

ఏ దివిలో వెలసిన పారిజాతమో

ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో


చరణం 2:


నిదుర మబ్బులను మెరుపు తీగవై 

కలలు రేపినది నీవే 

బ్రతుకు వీణ పై ప్రణయ రాగమును 

ఆలపించినది నీవే

నిదుర మబ్బులను మెరుపు తీగవై 

కలలు రేపినది నీవే 

బ్రతుకు వీణ పై ప్రణయ రాగమును 

ఆలపించినది నీవే


పదము పదములో మధువులూరగా 

కావ్య కన్యవై రావే

ఏ దివిలో వెలసిన పారిజాతమో

ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండిపోయెనే

ఏ దివిలో వెలసిన పారిజాతమో

ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి