10, మే 2024, శుక్రవారం

బంగారానికి సింగారానికి | Bangaraniki Singaraniki | Song Lyrics | Mande Gundelu (1979)

బంగారానికి సింగారానికి



చిత్రం :  మండే గుండెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


బంగారానికి సింగారానికి... 

కుదిరింది ఈనాడు బేరం

అసలిచ్చేది వడ్డీ కోసం...  

పడుతోంది పడరాని గారాం...


బంగారానికి సింగారానికి...  

కుదిరింది ఈనాడు బేరం

అసలిచ్చేది వడ్డీ కోసం... 

పడుతోంది పడరాని గారాం...


బంగారానికి సింగారానికి 

కుదిరింది ఈనాడు బేరం


చరణం 1 :


కాచే చెట్టుని కాచే వాడికే కాయలు దక్కాలి

కన్నెబిడ్డను గట్టుకు చేర్చిన కాళ్ళకి మొక్కాలి


చేసిన మేలుకు చెమ్మగిల్లిన కళ్ళను చూడాలి

చేసిన మేలుకు చెమ్మగిల్లిన కళ్ళను చూడాలి

అది చెప్పలేని పెదవులు 

పెట్టిన ముద్దులు పండాలి


బంగారానికి సింగారానికి 

కుదిరింది ఈనాడు బేరం


చరణం 2 :


చీరల రంగులు ఏనైనా దారంతోటే నేసేది

తీరని కోరిక ఏదైనా మారాం చేసే గెలిచేది


వయసే గారాం పొయ్యేది... 

మనసే మారాం చేసేది

గాజుల చేతుల తాళం తోనే 

కళ్యాణ మేళం మ్రోగేది


బంగారానికి సింగారానికి 

కుదిరింది ఈనాడు బేరం


చరణం 3 :


చిటపటలాడే చినుకులు కలిసే వరదై వచ్చేది

చిరుబురులాడే చిలిపితనాలే వలపుగ మారేది

చిటపటలాడే చినుకులు కలిసే వరదై వచ్చేది

చిరుబురులాడే చిలిపితనాలే వలపుగ మారేది


కొండకు పక్కన కోనుంటేనే నిండుగ ఉండేది

కొండకు పక్కన కోనుంటేనే నిండుగ ఉండేది

ఒకటికి పక్కన ఒకటుంటేనే రెండొకటయ్యేది


బంగారానికి సింగారానికి... 

కుదిరింది ఈనాడు బేరం

అసలిచ్చేది వడ్డీ కోసం...  

పడుతోంది పడరాని గారాం...


బంగారానికి సింగారానికి...  

కుదిరింది ఈనాడు బేరం

కుదిరింది ఈనాడు బేరం...


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి