3, మే 2024, శుక్రవారం

అలివేణీ ఆణిముత్యమా | Aliveni Animutyama | Song Lyrics | Mudda Mandaram (1981)

అలివేణీ.. ఆణిముత్యమా..



రచన  : వేటూరి సుందరరామ మూర్తి 

సంగీతం : P రమేష్ నాయుడు 

గానం : S P బాలసుబ్రహ్మణ్యం, S. జానకి 

చిత్రం : ముద్ద మందారం (1981)


పల్లవి :


అలివేణీ.. ఆణిముత్యమా..

నీ కంట నీటి ముత్యమా...

ఆవిరి చిగురో.. ఇది ఊపిరి కబురో..

స్వాతివాన లేత ఎండలో..

జాలినవ్వు.. జాజి దండలో..


అలివేణీ ఆణిముత్యమా..

నా పరువాల ప్రాణ ముత్యమా...

జాబిలి చలువో..ఇది వెన్నెల కొలువో..

స్వాతివాన లేత ఎండలో..

జాజిమల్లీ.. పూలగుండెలో..


అలివేణీ ఆణిముత్యమా...


చరణం 1:


కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..

కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి..

నుదుట ముద్దు పెట్టనా.. బొట్టుగా..

వద్దంటే ఒట్టుగా...

అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..

అందాల అమ్మకి.. కుందనాల కొమ్మకి..

అడుగు మడుగులొత్తనా.. మెత్తగా...

ఔనంటే తప్పుగా...


అలివేణీ ఆణిముత్యమా..

నా పరువాల ప్రాణ ముత్యమా


చరణం 2:


పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..

పొగడలేని ప్రేమకి.. పొన్నచెట్టు నీడకి..

పొగడదండలల్లు కోనా.. పూజగా...

పులకింతల పూజగా...


తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..

తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి..

చెలిమై నేనుండిపోనా.. చల్లగా...

మరుమల్లెలు చల్లగా...


అలివేణీ.. ఆణిముత్యమా..

నీ కంట నీటి ముత్యమా..

జాబిలి చలువో..

ఇది వెన్నెల కొలువో..

స్వాతివాన లేత ఎండలో

జాజిమల్లీ పూలగుండెలో..

అలివేణీ.....

ఆణిముత్యమా...


- పాటల ధనుస్సు  



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి