అలిగిన వేళనే చూడాలి
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల,
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : పి సుశీల,
పల్లవి :
అలిగిన వేళనె చూడాలి
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపులలోనే
రుసరుసలాడే చూపులలోనే
ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
చరణం 1 :
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి
తల్లి మేలుకొని దొంగను చూసి
అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
చరణం 2:
మోహన మురళీ గానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
మోహన మురళీ గానము వినగా
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోద
దృష్టి తగులునని జడిసి యశోద
తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి