20, ఏప్రిల్ 2024, శనివారం

స్నానాల గదిలో సంగీతమొస్తుంది | Snanala Gadilo | Songs Lyrics | Mande Gundelu (1979)

స్నానాల గదిలో సంగీతమొస్తుంది 



చిత్రం :  మండే గుండెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


స్నానాల గదిలో సంగీతమొస్తుంది 

ఎవరిడినా... టడటడా..ట..

చన్నీళ్ళు పడగానే సంగతులు 

పలుకుతాయి ఏ చవటకైనా


ఆ.. ఉమ్మ్మ్..

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

చెలి వచ్చి ఇవ్వాలి కౌగిళ్ళు.. 

నిలి వెచ్చనవుతాయి చన్నీళ్లు


అహ..హ.. హ

జిల్లుజిల్లుమన్నాయా నీళ్ళు... 

చలి చలి అంటోందా ఒళ్లు..   అవును

జిల్లుజిల్లుమన్నాయా నీళ్ళు... 

అవును.. చలి చలి అంటోందా ఒళ్లు.. 

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు.. 

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటోందా ఒళ్లు




చరణం 1 :


తలదాక మునిగాక చలి తీరిపోతుంది కానీ...

తలుపవతలేవున్న చెలి వచ్చి ముంచేసి పోనీ...


తలదాక మునిగాక చలి తీరిపోతుంది కానీ...

తలుపవతలేవున్న చెలి వచ్చి ముంచేసి పోనీ...


అహా.. మునిగేది గంగని.. 

ముంచేది రంభని అనుకొని

మునిగేది గంగని.. 

ముంచేది రంభని అనుకొని

మునిగి చూడు అంటావు చలి 

వొట్టి గిలిలాంటిదేనని  



జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు.. 

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటోందా ఒళ్లు



చరణం 2 :


సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు..

చెంబెక్కడున్నదో చెప్పేసి తలుపేసి వెళ్ళు

సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు.. 

అబ్బా...

చెంబెక్కడున్నదో కావల్స్తే ...

చెప్పేసి తలుపేసి వెళ్ళు 


మంటెక్కితే ఉన్న మత్తంత దిగుతుంది నీకు

మంటెక్కితే ఉన్న మత్తంత దిగుతుంది నీకు

తిక్కాకబోయి చక్కంగ వస్తుంది చూపు.. అహా..


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు.. 

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు

లలలలలాలలల్లలాలా ల..


లలలలలాలలల్లలాలా ల..


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి