13, ఏప్రిల్ 2024, శనివారం

రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ | Ramaya Thandri | Song Lyrics | Sampoorna Ramayanam (1971)

రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ!



చిత్రం :  సంపూర్ణ రామాయణం (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  కొసరాజు

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి


రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి 


చరణం 1 :


తాటకిని ఒక్కేటున కూల్చావంట

శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట

తాటకిని ఒక్కేటున కూల్చావంట

శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట


పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట

ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట


రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి


చరణం 2 :


ఆగు బాబూ ఆగు!

అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ

అయ్యా నే వత్తుండా! బాబూ నే వత్తుండ


నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట

నాకు తెలుసులే!

నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట

నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట

నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట


దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట

మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట


రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!

మా నోములన్ని పండినాయి రామయ తండ్రి

మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి


చరణం 3 :


అందరినీ దరిజేర్చు మారాజువే

అద్దరినీ చేర్చమని అడుగుతుండావే

అందరినీ దరిజేర్చు మారాజువే

అద్దరినీ చేర్చమని అడుగుతుండావే


నువు దాటలేక కాదులే రామయ తండ్రీ

నువు దాటలేక కాదులే రామయ తండ్రీ

నన్ను దయజూడగ వచ్చావు రామయ తండ్రి


హైలెస్సా రేలో హైలెస్సా

హైలెస్సా రేలో హైలెస్సా

హైలెస్సా రేలో హైలెస్సా

హైలెస్సా రేలో హైలెస్సా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి